వేపచెట్టు
మాతో పాటు మా ఇంట్లో 30 ఇయర్స్ కలిసి ఉంది..
చిన్న మెుక్కను తెచ్చి నాటాను అది పెద్ద వృక్షమై దాని కల్మషం లేని ప్రేమను మాకు పంచింది . మాకే కాక మా చుట్టుపక్కల వారికి కూడా పంచింది.
ఎంతో ఆరోగ్యాన్నే కాక దాని ఆకులను పూలను కూడా అందరికీ పంచింది.
ఉగాదికి అందరూ మా వేప చెట్టు పూలనే తీసుకు వెళ్లేవారు ఉగాది పచ్చడి లోకి..
ఆకులేమెా పోచమ్మ దేవుడికి, ఎల్లమ్మ దేవుడికి పెట్టేవారు..వేప పుల్లలతో ముఖం కడుక్కునే వాల్లు . దాని నీడన ఎంతో మంది సేదతీరే వారు..
దాని కొమ్మ కు ఉయ్యాలలు కట్టుకుని ఊగేవాల్లు పిల్లలు చిన్నప్పుడు..
దాని గాలి మా వీధికంతా ఆరోగ్యాన్ని పంచేది..
నిజంగా మా వేపను మేము వదిలి వస్తుంటే ఏడుపే వచ్చింది..
-ఉమాదేవి ఎర్రం
ఇది నా స్వంత రచన.