అందమైన ఆశ,-కె.కె.తాయారు

Comments · 257 Views

అందమైన ఆశ,-కె.కె.తాయారు

అందమైన ఆశ

 

అందమైన ఆకాశంలో
మేఘాల తొందర తో
పరగులలో రంగు రంగుల
కాంతులు కళ్ళకు పసందు

ప్రపంచమే మనదనే ప్రేమైక
జీవులకి, తెలిసింది కొంత
తెలియాల్సినది ఎంతో
ఆవేశంలో హాయిగా పరుగులిడు

యవ్వన సౌరభాలు,ఆలోచన లేని
ఆకతాయి చేష్టలు,పరువం వారి దైనా
కాని కాలం దొరకనిది,చేజార్చుకోవద్దు
తరుణం అవగతం చేసుకుని అడుగు

ముందుకు కెయ్యాలని ,తెలియ
చెబతోంది సాయం సమయం
చేజారితే గోదారే,ఆత్రుతలో గోత్రాల
రేవు వద్దు,వ్యర్థమైన మాట లొద్ధు

ముందుచూపు ముఖ్యము
ఆకాశం ప్రకృతి హెచ్చరించ
ఆలోచన పడ్డ ద్వయం
అయోమయ రాగ బధ్ధు లైరి !!

-కె.కె.తాయారు

Comments