మనసు బాట
ఏకాంతాల చీకటి మూసి
దిగంతాల వెలుగును వెతికి
దివిటీ లాంటి దైవత్వపు ఛాయలో
మనసు బాటలో నడిచాను
మనిషి ఛాయకై వెతికాను
వేదనలు వెతలు జమిలిగా
చెలిమిచేసే మందారాల్లా
చేత వెన్నముద్దంటుంటే
తోటి మనిషి సాంత్వనకై
బతుకుతోటంతా వెదికాను
నీరసాలు నిమ్మరసాలు
కూడబలుక్కుని ఫక్కుమంటుంటే
దిక్కుతోచని దీనుడినై
దీనబాంధవుడిని వెతికాను
సైంధవుడిలా అడ్డుపడే కాలాన్ని పక్కకు తోశాను
-సి.యస్.రాంబాబు