కోసే వజ్రత్వం కావాలి...!!!
భుక్తి కోసమా బురిడీ కోసమా
సమాజాన సముచిత స్థానం కోసమా
ప్రయత్నంలేని పరుగులతో ఆవేదవై...
పరిస్థితులకు దిగజారిపోతు కూడళ్ళలో
పొలిమెర పొద్దుల్లో అరచేతి సప్పట్లతో
హిజ్రత్వపు గుణలక్షణం నీలోని వ్యక్తిని
వ్యక్తిత్వాన్ని గుర్తింప చేయదు...
అణగారిన బతుకుకు రూపం కాదు
మెలిదిప్పిన సంఘంలో విలువల
ఉచ్ఛరణతో ఉద్యమమై పోరాడాలి...
కొడవలి కోణపు పదునువై పెరిగే
అన్యాయాన్ని కోసే వజ్రత్వం కావాలి...
హృదయం మెచ్చిన ఆంతరంగిక
బంధుత్వానికి సారథ్యం వహించాలి...
చేష్టలతో పలుకుబడి కూలబడి
మాటల నేర్పులు వెక్కిరింతలైనా...
గమ్యం తాలూకు మనుషుల స్వచ్ఛతకు
స్థావరం కావాలని కోరుకుంటు...
అర్ధనారీ తత్త్వం బోధపడిన శక్తివై
అభిమానం పిలుపై జ్ఞాన వేదికలతో
కాలం ఒడంబడికలను గెలువాలి...
విధిరాత ఎవరికి వక్రితం కాదు...
తలరాతానుసారం తప్పక మానదు
కామక్రోధాలను జయించిన
జోగినీమాత తత్త్వాన్ని వికాసాల
విడిదిలో నీ ఆవిష్కరణలకు బలమై
పూర్ణీభావంతో ఒలికిన సందేశాన్ని
సమయంగా ఆశయాలకై రేకెత్తించు...
దేరంగుల భైరవ (కర్నూలు)
9100688396