మధురమైన అనుభూతులు
ఒకప్పుడు పోస్ట్ బాక్స్ లే ఒకరిని ఒకరికి దగ్గర చేర్చేవిదూరంగా ఉన్నా కూడా!ఆ పోస్ట్ మాన్ కోసం ఎదురు చూపులు ఎంతో తీయగాఉండేవి..
అతని రాక వేయి వసంతాల తీరుగా భావించే వారు..టెలిగ్రాం వస్తే మాత్రం భయపడే వారు..ఇప్పుడా భయం కానీ తీయటి అనుభూతి కానీ ఏవీ లేవు..ఏ సమాచారమైనా వెంట వెంటనే! స్మార్ట్ ఫోన్ల ద్వారా!
నేను ఇంటర్ చదివే రోజుల్లో అయితే కలం స్నేహం ద్వారా ఉత్తరాలు రాసుకునే వాళ్ళం..నిజంగా చాలా అధ్బుతంగా అనిపించేది..
ఒకరినొకరం చూసుకోకుండా ఒకరి భావాలు ఒకరం పంచుకోవడం భలేగా ఉండేది..
నేనైతే ఆ ఉత్తరాల కోసం చాలా ఎదురు చూసేదాన్నిఅలాగే నా ఉత్తరాల కోసం మా ఫ్రెండ్స్ కూడా చాలా ఎదురు చూసే వారట..
చాలా సంవత్సరాలకు కలిసినప్పుడు కొందరు చెప్పారునిజంగా ఆ కాలపు ఆనందాలే బాగుండే!!అవన్నీ తీయటి జ్ఞాపకాలు..
నా మధురమైన అనుభూతులు..
-ఉమాదేవి ఎర్రం