గూటిలోని గువ్వల జంట

Comments · 204 Views

గూటిలోని గువ్వల జంట,-ఉమాదేవి ఎర్రం 

గూటిలోని గువ్వల జంట

 

శివుడు పార్వతి ఒకరోజు కొలువు తీరి ఉన్నప్పుడుపార్వతి శివుడిని మీ మెడలో ఉన్న కపాల మాల గురించి చెప్పమని అడిగింది..

నువ్వు ఒక్కో జన్మ ఎత్తినపుడు ఒక్కో కపాలం చేర్చి మెడలో ధరిస్తున్నా అన్నాడు..నేను ఎన్నో జన్మలు ఎత్తుతున్నా మరి మీరు మాత్రంఅలాగే ఉండడం ఎలా సాధ్యం ? అంది..

అప్పుడు శివుడు అది పరమ రహస్యం ప్రాణకోటి లేనిరహస్య ప్రదేశంలో మాత్రమే చెప్పాలి అని అంతా వెతికాడు..హిమాలయాల్లోని అమర్ నాథ్ గుహను ఎంచుకున్నాడు..

పరివారంతో బయలు దేరిన శివుడు ఒక్కో చోట ఒక్కోపరివారాన్ని వదిలేసాడు..అవన్నీ కూడా దేవస్థానాలుగా ప్రసిద్ది చెందాయి..

నందిని విడిచిన ఊరు భైల్ గావ్ ( పహెల్ గావ్ )చంద్రుణ్ణి చంద్రబాడి అనే ఊరు మెడలో పామును
శేష్ నాగ్ గాకుమారుడిని గణపతిని మహాగుణ పర్వతం దగ్గర వదిలాడు గంగమ్మను పంచతరణి వద్ద వదిలాడు..

గుహలోకి మాత్రం పార్వతి శివుడు ఇద్దరే వెళ్లారు..వెళ్లాక తన ఢమరుకంతో శబ్దం చేయగానె అన్ని పక్షులు బయటకు వెళ్లాయట ..

అప్పుడు శివుడు తన అమరత్వం పార్వతికి చెప్తున్నప్పుడే రెండు గుడ్లలోని పావురాలు బయటకు వచ్చాయట..

అయ్యెా! స్వామీ ఇవి విన్నాయి కదా అని పార్వతి అంటే..వాటికి అమరత్వం లభించింది. ఇక అవి కూడా ఎప్పుడూ చిరంజీవులుగా జీవించి ఉంటాయి అని చెప్పాడు శివుడు..

ఆ గువ్వల జంట ఇప్పటికీ కనిపిస్తాయట..కానీ అందరికీ కనిపించవట..చాలా పుణ్యం చేసుకున్న వాళ్లకే కనిపిస్తాయట..

ఆ గువ్వల జంట సజీవులట..అమర్ నాథ్ లో ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయట..

ఇది నేను విన్న కథ

-ఉమాదేవి ఎర్రం 

Comments