రా హృదయమా రా హృదయమా...

Комментарии · 126 Просмотры

హృదయమా హృదయమా ఎక్కడికి <br>నాలో నువ్వు ఉండకుండా ఎక్కడికి పోతున్నావు <br>నీలో ఉన్న స్వార్థం , వంకర బుద్ధులు వదుల?

హృదయమా హృదయమా ఎక్కడికి

నాలో నువ్వు ఉండకుండా ఎక్కడికి పోతున్నావు

నీలో ఉన్న స్వార్థం , వంకర బుద్ధులు వదులుకుంటేనే

నీలో చేరుతాను అప్పటివరకు

నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను...

హృదయమా హృదయమా వెళ్ళకు వెళ్ళకు...

నువ్వు లేకపోతే నేను బతకలేను

నాకు ఇష్టమైన వాళ్ళని నిన్ను నీలో దాచుకోలేను

ఎందుకు నన్ను ఇంత కఠినంగా శిక్షిస్తున్నావు...

నువ్వు మానవుడిగా పుట్టి నీ హృదయంతో చేసిన

నీచ ఆలోచనలు తట్టుకోలేక వెళ్ళిపోతున్న

నీ నుండి దూరంగా వెళ్లిపోతున్న

ఆ కళ్ళు ఎక్కడో చూస్తున్నాయి

నీ మాటలు వంకరగా మాట్లాడుతున్నాయి

నీ వెక్కిరి నవ్వులు చూస్తుంటే భయం వేస్తుంది

అందుకే వెళ్ళిపోతున్న వెళ్ళిపోతున్నా

నువ్వు నా దారి చేరకు...

హృదయమా హృదయమా నా బుద్ధిని మార్చుకుంటాను

వెళ్ళకు వెళ్ళకు నన్ను వదిలి వెళ్ళకు

నువ్వు లేకపోతే నేను పోతాను నరకం లోకి

ఇకనుంచి ఉంటాను బుద్ధిగా...

రా హృదయమా రా నాలో చేరిపో

నువ్వు లేకపోతే నా హృదయంలో ఎవర్ని పదిలంగా పెట్టుకుంటాను

రా హృదయమా రా హృదయమా...

ఓ నా హృదయమా హృదయమా రా...

*మాధవి కాళ్ల..*

*హామీ పత్రం :⁠-*

*ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను..*

Комментарии