గురువు
"పలక పై ప్రపంచాన్ని చూపిన;" బ్రహ్మ జ్ఞాని నీవెక్కడ? నీకోసం వెదుకుతున్న నీ రాకకై
ఈ నిశిధిలో,
విశ్వంలోని విజ్ఞానాన్ని పంచిన విష్ణురూపమా నీవెక్కడ, నేవెదుకుతున్న ఈ ఉషస్సు లో నీ జాడకై,
అనంతబ్రమ్మాండ లోకాలలో జ్ఞానాన్ని నొసంగి న మహేశ్వర నీవెక్కడ, వెదుకుతున్న నీకోసం ఈ విశాలవిశ్వంలో,
ఓ గురువార్య దూరంగా నున్న, నా దగ్గర లేకున్న నాలో వుంది మీరు నిసంగిన జ్ఞానదీపం, అది నిరంతరం కాంతులీనుతూ అఙ్ఞానమనే చీకటిని ప్రాలద్రోలే దీపంవలే నిరంతరం వెలుగులీనుతూనేవుంది.
ఓ మహేశ్వర మీకోసం నే చూడనేలా మీరు నాకొసంగిన జ్ఞానదీపం నాలో వెలుగుతూ అందులో నిక్షిప్తమైన మీరు నన్ను వెన్నంటి నడిపిస్తున్నారు కదా!
ఓ విష్ణురూపాయ నేనో అఙ్ఞానిని నాలో వున్న మిమ్మల్నే గుర్తించలేక పోయానే, ఓ పర బ్రహ్మ మిము మదినందు తలచి, మీరు ప్రవచించిన జ్ఞానాన్ని నిరంతరం విశ్వవ్యాప్తం చేస్తూ గురుభక్తి ని చాటుతూనే వుంటాను.
* "గురు బ్రహ్మ గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మైశ్రీ గురువే నమః."
Venkata Bhanu prasad Chalasani 36 w
మంచి రచన.