అమ్మలాడు భాష-ఎమ్. రాజమణి

Comments · 721 Views

 అమ్మలాడు భాష-ఎమ్. రాజమణి

 అమ్మలాడు భాష

తెలుగు భాష సుమధురమైన భాష
అమ్మ భాష కమ్మని వెలుగుల తెలుగు భాష
తేనెల తేటలూరు తీయనైన భాష తెలుగు భాష
కల్లాకపటం తెలియని స్వచ్ఛమైన భాష నా తెలుగు భాష
మమతలకు చల్లని ఒడిలాంటిది తెలుగు భాష
ఉగ్గుపాలతో మాతృమూర్తి నేర్పిన మమతల భాష
హావాభావాలు పంచే రమ్యమైన భాష
అమ్మలాడు భాష అమృత భాష నా తెలుగు భాష
కలువ రేకుల లాంటి అందమైన ది నా తెలుగు భాష
అక్షరాలు గల కమ్మనైన పదకళ భాష
అమ్మలు మురిపించే మురిపాల భాష నా తెలుగు భాష
నాయనమ్మ కథలు చెప్పే రసమయి భాష నా తెలుగు భాష
భావగుభాళింపుల సుగంధాల భాష నా తెలుగు భాష
ఆణిముత్యాలు నా తెలుగు భాష
అంద చందాలన ఘనమైనది నా తెలుగు భాష
కోయిల గానం వంటిది నా తెలుగు భాష
నాకు నడక నేర్పినది నా తెలుగు భాష
నన్ను పెంచి పెద్ద చేసినది నా తెలుగు భాష
నాకు నడక నేర్పినది నా తెలుగు భాష
అణువణువునా పెనవేసెను నా తెలుగు భాష
అనుకువ నేర్పినది నా తెలుగు భాష
ఖండాంతరాలలో కీర్తిని చాటేను నా తెలుగు భాష
ప్రపంచ భాషలలో బేష్ అయ్యెను నా తెలుగు భాష
నేడు తెలుగు రాష్ట్రాల్లో తెల్లబోయేను నా తెలుగు భాష
తెలుగు కనుమరుగు కాకుండా కాపాడుదాం
తెలుగు తల్లి దీవెనలు అందుకుందాము

-ఎమ్. రాజమణి

Comments