చెల్లి కోసం అన్న చేసిన ప్రమాణం-హైమ

Comments · 535 Views

చెల్లి కోసం అన్న చేసిన ప్రమాణం-హైమ

చెల్లి కోసం అన్న చేసిన ప్రమాణం

వయసులో నా కన్నా చిన్నదైనా....
అమ్మ ప్రేమను పంచుతున్న ....
నాన్న ప్రేమను అందిస్తున్న ....
నా చెల్లెలి కోసం....
ఏదైనా ఇవ్వాలని ఉన్నా....
ఏమీ ఇవ్వలేని ఓ అనాధ అన్నను నేను....
చాలీ చాలని అన్నంతో....
తన కడుపు నింపాలని చూసే....
నా కడుపు నింపడం కోసం....
తను పస్తులుండే బంగారు తల్లి నా చెల్లి....
తన ప్రేమ మధురం....
తన అభిమానం ....
కొలతలు లేని ఒక కొలమానం....
అలాంటి నా చెల్లెలి కోసం ....
తన ప్రతి కష్టంలోనూ  తోడుండాలని....
తన బాధలు తీర్చలేక పోయినా....
తన కన్నీటిని తుడిచే చేతినవ్వాలని....
చందమామను తెచ్చి ఇవ్వలేక పోయినా....
తన పై చల్లని వెన్నెల కురిపించే రాతిరినవ్వాలని....
నాకు నేనే చేసుకున్నాను ప్రమాణం....
మా అన్నా చెల్లెళ్ల అనుబంధం సాక్షిగా.

 

-హైమ

Comments