చిత్ర కవిత...
తల్లి ఆహర్నిషలూ కష్టపడి
పిల్లలను పెంచుతుంది
తండ్రి ఎక్కడికి ఎటు వెళ్లి పోతాడో
తెలియదు..
ఆ పిల్లల కోసం తల్లి పడే పాట్లు
అన్నీ ఇన్నీ కావు
వలస పోతూ కూలీ పనులు చేస్తూ పిల్లలను వెంట తీసుకు
పోతూ పనులు చేస్తుంటారు
ఆ పనుల దగ్గర పిల్లలకు దెబ్బలు తాకుతూ తాకించు కుంటూ ఆడుతూ ఉంటారు..
వారికి ఏ గాయమైనా తల్లికే భారం భయం కూడ..
కోటి విధ్యలు కూటి కొరకే
పొట్ట కూటి కోసం వలస పోయి పనులు చేసుకుంటూ బ్రతకడమే వారి ధ్యేయం!
అలా బ్రతుకుతున్న వారికే మాటలు అందరూ అదిరించి హెదిరించే వారే కానీ ఎవరూ ఆదరించే వారు ఉండరు!!
సచ్చే వరకూ బ్రతకాలి కనుక అన్నీటిని ఎదుర్కొంటూ బ్రతుకుతారు!!
పేదరికమే వారికి శాపం!!
లేదెవరి పై కోపం!!పుట్టించిన దేవుడి పైనే భారం!!
నారు పోసిన దేవుడు నీరు పోస్తాడని నమ్మకం!!
ఉమాదేవి ఎర్రం..
ఇది నా స్వంత రచన..