సాయిచరితము-199 - సి.యస్.రాంబాబు

Bình luận · 285 Lượt xem

- సి.యస్.రాంబాబు సాయిచరితము-199

సాయిచరితము-199

పల్లవి
చెడునుంచి కాపాడి
మంచి మార్గము చూపి
మనవెంట ఉండే
సాయినాధుడొకడేగా

చరణం
గురువంటే జ్ఞానమని
వెలుగు చూపుతాడనుచు
బోధించిన సాయికి
వేలవేల వందనములు

చరణం
ఎవరినించి ఆశించడు
ఎవరినీ శాసించడు
నిత్య ధ్యానమొకటే
తనమార్గము అంటాడు

చరణం
శాంతినే కాంక్షించి
భ్రాంతినే తొలగించి
ముక్తిబాట వేయునుగా
సాయినామమొకటేగా

చరణం
సత్యమే తను పలుకు
నిత్యమై తను నిలుచు
భేదభావనొద్దని
తన పలుకుగ చెప్పెనుగా

- సి.యస్.రాంబాబు

Bình luận
Venkata Bhanu prasad Chalasani 47 Trong

సాయి చరితము బాగుంది.