వేచిచూడాలంతే - సి.యస్.రాంబాబు

코멘트 · 241 견해

- సి.యస్.రాంబాబు వేచిచూడాలంతే

వేచిచూడాలంతే

కలలు తెగటం లేదు
కలం సాగటం లేదు
కాలం ఆగటం లేదు
మనసు మాట వినదు
భావం హృదికందదు
ఆలోచనల ఆకలి పెరుగుతుంటుంది

బతుకుపాటకు లయకుదరదు
బతికే క్షణాలకు చోటు దొరకదు
పెరిగే వయసు పరుగాపదు
పట్టాలెక్కిన జీవితం పట్టుతప్పుతుంది
పారవశ్యం పందిరి వాడిపోతుంది
నీడనిచ్చే చెట్టు నవ్వుతుంటుంది
అమ్మ లాలిపాటలా

వేసారిన క్షణాలలో
వేసవి వానలా ఆప్తమిత్రుని వాక్యం
ఆపన్నహస్తమై చుట్టేస్తుంది
ఆరుబయలు వెన్నెల
వెన్ను నిమురుతుంది
వేచి చూడాలంతే

- సి.యస్.రాంబాబు

코멘트