పులిరాజా నా బావా...!!! కొర్రమీను చూపులతో అలల రెక్కలపై ఎదురీదుతు... పురిదిప్పిన మీసాలు బిగువైన కండరాలు ఏతమేసే పడవకు అంకితమైనా... ఎదనిండిన మనస్సుతో ఎటంచున దోసిట దాచిన దీపమై చూస్తున్నా పులిరాజా నా బావా... బిగచుట్టిన తలపాగతో... నుదిటి తిలకం చెదరనీయవు వడిచుట్టిన నడుమున పిడిబాకును జారనీయవు... ఒడినించుకొన్న మరదలి ప్రేమను ఒలికిపోనీయని వలపుగలవాడవు.. పులిరాజా నా బావా... కచ్చుల ముఖంతో కనుబొమ్మలు బెదిరించినా కరుణ జూపడం మరిచిపోవు... కోరినంతనే అగాధాలకు ఈదుతు ప్రేమను తేల్చిన సాత్వికుడవు... మాటను దాటని మట్టి మనిషివి... పులిరాజా నా బావా... వెన్నెల కోనలు పున్నమి రేయికి స్వాగతం పలికాయి... పులస చేపను పులుసుగా వండాను నన్ను గెలిచిన నీవే నా లోకమని... ముద్ద ముద్దను మురిపెంగా కలిపేటి పులిరాజా నా బావా... దేరంగుల భైరవ
Tìm kiếm
Bài viết phổ biến