అశాంతి -మాధవి కాళ్ల

Comments · 240 Views

అశాంతి -మాధవి కాళ్ల

అశాంతి

పెళ్లి అయిన తరువాత కడుపుతో ఉన్నానన్ని తెలిసి చాలా సంతోషం పడ్డారు. నాకు ఏడవ నెలలో సీమంతం జరిపి మా అమ్మ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. మా అత్త గారు మా ఇంట్లో ఉన్నారు. నాలుగు రోజులు తర్వాత

"నన్ను నీతో పాటు తీసుకొని వెళతాను అని చెప్పు మా ఆయనకి చెప్పాను."
"ఆయన సరే" చెప్పి సైలెంట్ గా ఉన్నారు.

'నేను ఆయనతో ఇంటికి వెళ్ళి పది రోజులు ఉండి ఇల్లు సర్ది వచ్చేసాను అని అనుకున్నా.'

"అమ్మమో ఆయనతో మీ అమ్మ నాకు పది రోజులు పంపించు రాధ అని చెప్పలేదు. అందుకే నేను పల్లవిని ( పల్లవి ఎవరో అనుకోకండి నేనే )నీతో పంపించాను అని చెప్పేసింది."

"సరే లే అత్త. నువ్వు మళ్ళీ ఎందుకు రావడం అని చెప్పి" సైలెంట్ గా ఉండిపోయాడు శ్రీధర్. నాకు డెలివరీ నొప్పులు మొదలు అయ్యాయి. నాకు ఎలా నొప్పులు వస్తాయో తెలీదు కాబట్టి. ఈ విషయం అమ్మకి చెప్పలేదు.

అర్ధరాత్రి 12 గంటలకు నొప్పులు తట్టుకోలేక అమ్మకి చెప్పితే బ్లాక్ టీ చేసి ఇచ్చింది. టీ తాగి కాసేపు వాకింగ్ చేశాను. కూర్చోలేకపోతున్నాను , నిలబడలేకపోతున్నాను 2 గంటలు తరువాత ఇంకా నా వల్ల కాదు.

నొప్పులు ఎక్కువ వస్తున్నాయి. గట్టిగా అరుస్తున్నా , నా వల్ల కావట్లేదు. ఇంకా నాన్న వెళ్లి ఆటో తీసుకొని వచ్చారు. నాతో పాటు అమ్మ , నాన్న , శ్రీధర్ వచ్చారు.

అక్కడ చేర్పించిన తర్వాత ఏమో ఒక రూమ్ లో పెట్టారు డ్యూటీ డాక్టర్ వచ్చే పెయిన్ నొప్పులను బిగపెట్టేయమ్మా అన్నారు. ఆ పక్కనున్న నర్స్ ఏమో బీగబడితే బిడ్డకి ప్రాబ్లం అవుతుంది.

అమ్మ బిగ పట్టదు అని చెప్పింది ఆమె. ఇక నేను తట్టుకోలేక నొప్పులను బిగబెట్టేసాను. నార్మల్ డెలివరీ అయింది బాబు పుట్టాడు.

అందరూ ఆనందంగా ఉన్నారు. మా అమ్మ వాళ్ళు బయట ఎన్ని టెన్షన్లు ఉన్న బాబు తో గడిపిన తరువాత వాళ్ళు మర్చిపోతున్నారు.
ఎవరైన చిన్న పిల్లలతో గడిపితే అన్ని మర్చిపోతారు.ఆ ఆనందంలో ఇంట్లో వాళ్ళు మునిగి పోతున్నారు.

కొన్ని నెలల తర్వాత నేను శ్రీధర్ తో కలిసి మా ఇంటికి వెళ్లిపోయాము.ఇంట్లో అశాంతి ఏర్పడింది. మా నాన్న బాగా బాధ పడ్డారు.

అమ్మ వాళ్ళ జీవితంలో ఎన్ని గొడవలు ఉన్న మనశ్శాంతి లేకుండా పోయింది. బాబు పుట్టిన తరువాత ఇంట్లో వాళ్ల అందరూ ప్రశాంతంగా గడిపేవారు.

నేను వెళ్లిపోయిన తరువాత ఇంట్లో వాళ్ళు అశాంతిగా లేకుండా ఉన్నారు అని వాళ్ళ మాటల్లో నాకు అర్దం అయింది.

కొన్ని రోజులు తరువాత అమ్మానాన్నలు మా ఇంటికి వచ్చి బాబుతో బాగా గడిపారు.వాళ్ళ మొఖంలో మనశ్శాంతి కనిపించింది..అప్పుడు నేను సంతోషంగా ఉన్నాను..

-మాధవి కాళ్ల

Comments