సైనికుడు - హనుమంత

Comments · 347 Views

సైనికుడు - హనుమంత

సైనికుడు

సైనికుడా!...
మండే ఎండకు
కరిగే మంచుకు
చీల్చే తూటాకు
ఎదురేనా నీ పయనం...
అడుగడుగునా సుడిగుండం
అవనికై సాగు పోరాటం
అమ్మేగా ఈ భారతం
ఆప్తులే ఈ జనమంతా....
ఏ పొగడ్త సాటి నీకు
ఏ గౌరవం సరి తూగదు నీకు
ఎగిరే పతాకమే నీ పొగరు
పొంగే లావా నీ నెత్తురు.....
ఆకలితో అలమటించినా
గాయాలతో బరువనిపించినా
శ్వాసే అలసిపోయినా
వెనుదిరగని బాణం నువ్వు....

- హనుమంత

 

Comments