సంతోషాలు

Comments · 196 Views

సంతోషాలు -సి.యస్.రాంబాబు

సంతోషాలు..

రేపెప్పుడూ సందేహమే 
నేడెప్పుడూ జనసందోహమే 
అది తెలిస్తే మనసుకు సందేశమే 

నిన్నెప్పుడు జ్ఞాపకమే 
వృద్ధాప్యంలో అది వ్యాపకమే
మనసపుడు ఇక పరిపక్వమే 

నువ్వెప్పుడూ ప్రశ్నార్థకమే 
కాకూడదది నిరర్థకమే
బంతిలాంటి బతుకెపుడూ వ్యాసార్థమే

కష్టాలు కన్నీరు ప్రవాహమే
కావాలవి నిను నడిపే వాహనమై 
నిను మార్చివేసే కొత్త జననమై

-సి.యస్.రాంబాబు

Comments