ఆనందమైన...... అందం
ఒక వైపు
ఆకాశం....
మరో పక్క
నేను...
విప్పారిన
రెక్కలు...
సొగసయిన
సరిగమల
ఆశల.... శ్వాసలు
తీస్తూ...
సొగసుగా
మోస్తూ....
అలుపెరుగని
ప్రయాణం...
అనంత లోకాల్లో
నీ కోసం
పరితపిస్తూ
మానవత్వం రుచి
నీకు
చూపాలి...
నీవు ఇచ్చిన
వరమే కదూ
నీకు ఇవ్వాలి
మరు
బహుమానంగా
తరాలుగా
తారల
చమక్కుల్లో
దూరం ఉన్నా...
దరి లోనే
ఉన్నావని
అందుకోవాలనే ..
ఆశా.... భావం
నా మనసులో
మెదిలే
నీ తలపుల
సృహల
ఆనందమే....
అనంత
అందమైన
మనసులో
అందమైన
నీవే....
నాలో...
నీవే.....
-అల్లావుద్దీన్
PS: అంతే అందమైన మనసున్న మా నాన్న బషీరుద్దీన్ షేక్ కు, అనంతమైన ప్రేమతో అంకితం (స్వతః గా తను కూడా కవిత లు వ్రాసే వారు )
Venkata Bhanu prasad Chalasani 21 w
చాలా హృద్యంగా వర్ణించారు