సూత్రమై చెబుతున్నది...!!!
ఆ... ముఖారవిందాన నవ్వులు
వికసించినా మందారాల పువ్వులు
ఉర్విజనులకు దేవతవో లేక...
మనస్సుల మర్మాన్ని చిలికే మచ్ఛింద్రవో
విషయాన్నడిగినా చెప్పదు...
కుంపటి దాచని స్నేహంగా పెరిగిన
ఐక్యత పదారణాల తెలుగుదనంగా
ఉట్టిపడుతుంది నీలో...
పేర్చిన పాలరాయి పలకళ్ళాంటి
పళ్ళ వరుసను ముసి ముసి నవ్వులు
తడుపుతు మాటాడని నాలుక మౌనమై
రెప్పల చాటున మజిలీగా నిలిచిపోయి...
కొస కంటితో ఆ దూరపు మళ్ళింపులను
సొంతం చేసుకోవాలని చూస్తున్నది...
సమరమైనా బెదరని ధీమాతో...
మెడన జారిన పచ్చలహారం చెప్పకనే
చెబుతున్నది నీలోని ఆలోచనలకు
దివిటికట్టి కారణాలకు లొంగని కార్యమై
తొలిచిన బరువును మెదడుకు మేతగా
పెడుతు ప్రయాణమవుతున్నది అందరి
శ్రమల ఫలితం ప్రగతై నడువాలని...
వేదనకు తిలోదకాలిచ్చి...
ఆరంభానికి చుట్టిన శ్రీకారం గెలుపు
కావాలని ఆ నగులతో నాపచేలను
పండిస్తు పలికిన పదాలతో హృదయ
పూర్వకమై...
కొందరితో నగడం కోరిక కాదని
అందరితో నగడం ఆనందమనే
రహస్యాన్ని సూత్రమై చెబుతున్నది...
దేరంగుల భైరవ (కర్నూలు)