కాంట్రాస్ట్ -సి.యస్.రాంబాబు

Comments · 170 Views

కాంట్రాస్ట్ -సి.యస్.రాంబాబు

కాంట్రాస్ట్

ఇప్పుడు జీవితమో పరుగు పందెం 
విశ్రాంతి లేదు..విరామం లేదు 
ఆటవిడుపు లేదు
పట్టువిడుపులు లేవు 
ఇది కొందరికి 

జీవితం ఖాళీలు పూరించలేని కొందరు 
ఆకలిదప్పులే తోడుగా మిగిలున్నారు
ఆదుకునేవారులేక ఎదురు చూపులు చూస్తున్నారు 

అసమానతల నీడలో 
అశాంతిగా కదిలాను 
ప్రపంచమే కుగ్రామమై పరిహసిస్తుంటే 
పంచభూతాలు జాలిగా చూస్తున్నాయి 
ఏ దేవుడూ సమాధానం చెప్పటం లేదు

-సి.యస్.రాంబాబు

Comments