అంతర్జాతీయ ఆకలి దినోత్సవం -భవ్యచారు

Comments · 233 Views

అంతర్జాతీయ ఆకలి దినోత్సవం -భవ్యచారు

 

అంతర్జాతీయ ఆకలి దినోత్సవం

మే 28 అంతర్జాతీయ ఆకలి దినోత్సవం గా జరుపుకుంటారు. అన్నం లేక పెట్టేవారు  ఎవరూ లేక నిరుపేదలుగా చాలా మంది పేదలు భారతదేశంలో ఉన్నారు. చాలా మంది అడుక్కోవడం మనం ప్రతి రోజు చూస్తూనే ఉంటాం. అయితే ఆకలి బాధ ఏంటి అనేది అది  అనుభవించిన వారికే తెలుస్తుంది.అందుకే పెద్దలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు, కానీ ఈ రోజుల్లో చాలా మంది విందులు, వినోదాల పేరిట అన్నాన్ని వృధా చేస్తున్నారు, కొందరు మాత్రం మిగిలిన దాన్ని పేదలకు పంచుతున్నారు.

అసలు ఈ ఆకలి దినోత్సవం ఎలా ప్రారంభం అయ్యిందో తెల్సుకుందాం..

2011 మే 28 న అంతర్జాతీయ ఆకలి దినోత్సవం గా జరుపుకుంటారు. దిన్ని జరుపుకోవడం వెనకున్న ప్రధాన లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా దీర్ఘకాలిక ఆకలి గురించి 800 మిలియన్ల కంటే ఎక్కువమంది ప్రజలు అపారమైన పేదరికంలో చిక్కుకుపోయరనే దానిపై అవగాహన పెంచడం ,పెంపొందించడమే కాకుండా పేదరిక సమస్యలను పరిష్కరిచే ఉపాయాలను కనిపెట్టే చర్యలు తీసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

*ప్రపంచ ఆకలి దినోత్సవ చరిత్ర*

 

 ఈ అంతర్జాతీయ ఆకలి దినోత్సవంను ది హంగర్ ప్రాజెక్ట్ ప్రారంభించింది.ఇది అంతర్జాతీయ ఆకలి మరియు పేదరికాన్ని ప్రారద్రోలడానికి కట్టుబడి ఉంది.1977 లో స్థాపించబడిన లాభాపేక్షలేని ప్రాజెక్ట్ ఇది.ఈ ప్రాజెక్ట్ లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి దేశాధినేతలు,వ్యాపారాలు, కార్యనిర్వాహకులు కలిగి ఉంది.అందరికి సామాజిక న్యాయం,హక్కుల గురించి ఈ ప్రాజెక్ట్ పోరాడుతుంది.

*ప్రాముఖ్యత*

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 690 మిలియన్ల ప్రజలు ఆకలితో జీవిస్తున్నారని ఒక సర్వేలో తేలింది, దాని ప్రకారం వీరిలో మహిళలు 60శాతం పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిలో 98 శాతం తక్కువ ఆదాయ దేశాలకు చెందినవారు ఉండగా,ఇంకా కొన్ని వ్యాధుల బారిన పడిన వారు ఉన్నారు.

ఈ రోజు ఈ అసమానతను పరిష్కరించడానికి పేదలకు ఒకరోజు విలువైన ఆహారాన్ని అందించడం కంటే పేదరికం, అనారోగ్యాలను పూర్తిగా నిర్మూలించే పరిష్కారాలను కనుగొంటుంది.

ఈ హంగర్ ప్రాజెక్ట్ కేవలం ఆకలి గురించి, పేదరికం గురించే కాకుండా ఒక్కో సంవత్సరం ఒక్కో థీమ్ ను కల్పిస్తుంది.పేదలకు ఆహారంతో పాటు పేద విద్యార్ధులకు విద్యను అందించడం,మరియు సాంకేతికతను నేర్పడంలో కృషి చేస్తుంది.అలాగే చిన్న గ్రామాల్లో కనీస ప్రాథమిక విద్య కూడా లేని చోట విద్యను అందిస్తుంది.విద్య,సామజిక అసమానతలను,పక్షపాతాలను దూరం చేయడం, సమన హక్కులను, అవకాశాలను సృష్టించడానికి, వేరే ఇతర వర్గాలను శక్తివంతం చేయడానికి సహాయ పడుతుంది.

అన్నం పరబ్రహ్మ స్వరూపం చూశారుగా కొన్ని కోట్ల మంది ఆకలితో బాధపడుతున్నరనే విషయం తెలిసిన తర్వాత కూడా అన్నాన్ని వృధా చేయకుండా అది లేనివారికి ,ఆకలితో ఉన్నవారికి అందించి మీరూ సహాయపడతారని ఆశిస్తూ...

అందరూ బాగుండాలి,అందులో మనముండాలి అనే విషయాన్నీ మర్చిపోకుండా ఆహారాన్ని వృధా చేయకుండా మీకు చేతనైనంత వరకు సాయం అందిస్తారని, అందించాలని,దేశంలో ఆకలితో ఎవరూ చనిపోయే రోజులు రాకూడదు అని,దేశం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ....

 

-భవ్యచారు   

   

Comments
Venkata Bhanu prasad Chalasani 30 w

తెలియని విషయాలు ఎన్నో వ్రాసారు.