పెళ్ళికి ముందు సహా జీవనం 

הערות · 213 צפיות

పెళ్ళికి ముందు సహా జీవనం - -మాధవి కాళ్ళ

పెళ్ళికి ముందు సహా జీవనం 

 

పెళ్ళికి ముందు మన సహజీవనానికి నేను సమర్థిస్తాను ఎందుకంటే పెళ్లికి ముందు మనకి ఎన్నో ఆశలు ఉంటాయి ఆశయాలు ఉంటాయి వాటిని సాధించాలి అని ఇంకెన్నో చెయ్యాలి అని కోరికలు , కలలు ఉంటాయి. 
కానీ పెళ్లి తర్వాత అవి నెరవేరవని చాలామంది అభిప్రాయపడతారు. కానీ అందరూ అభిప్రాయాలను తప్పుపట్టలేం ఇక్కడ కొందరు అర్థం చేసుకొని మన కలలకు సహకరించే వాళ్ళు తోడుగా నిలిచే వాళ్ళు కూడా ఉన్నారు. 
అదే మన కలలను అవహేళన చేసి నువ్వు చేయగలవా అని అపనమ్మకంతో అంటే వాళ్ళు చాలా బాధపడతారు అనవసరంగా పెళ్లి చేసుకున్నానే నా కలల్ని నా గమ్యాలను చేరుకున్న తర్వాత చేసుకోవాల్సిందే అని ప్రతిక్షణం బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని పరోక్షంగా నేను చూడకపోయినా వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ బాధలను ప్రతిరోజు చవిచూస్తూ ఉన్నాను. 
అలాగైతే పెళ్లి తర్వాత సహజీవనం బాగుండదని అనట్లేదు అర్థం చేసుకునే మనస్తత్వాల్లో ఉంటుంది. అది ఎవ్వరి మనస్తత్వమైన సరే భార్యదైనా భర్తదైనా....

 

-మాధవి కాళ్ళ

הערות