ఫ్రాంక్
సీత ఒక అనాథ. పరీక్షలు రాయడానికి వేరే ఊరు వస్తుంది. ఆమెకి కళ్ళు కూడా కనిపించవు. ఒక రోజు పరీక్ష హల్ కి వెళ్ళడానికి బస్ స్టాప్ కి వెళ్లి బస్ కోసం ఎదురు చూస్తుంది. అదే బస్ స్టాప్ లో ఒక పెద్దాయన బెంచి మీద కూర్చుని తన పక్కన బ్యాగ్ పెట్టి అలా వెనక్కి తలవాల్చి పడుకుంటాడు. ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతుంది సీత. అయితే దొంగ మెల్లగా వచ్చి ఆ పెద్దాయన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ బస్ స్టాప్ లో సీత ఆ పెద్దాయన తప్ప ఎవ్వరు లేరు.
గంట తర్వాత ఆ పెద్దాయనకి మేలుకో వచ్చి పక్కన చేయి పెట్టి చూడగానే బ్యాగ్ లేదు. ఆయన కంగారుతో ఆ బ్యాగ్ గురించి సీత కడిగితే నాకు తెలియదండి నాకు కనిపించదు అని దిగులుగా చెప్తుంది. అప్పుడే ఒక కానిస్టేబుల్ వచ్చి ,
"ఏం జరిగింది? ఎందుకు కంగారు పడుతున్నావ్?" అని అడిగారు.
"నా పేరు కృష్ణ వేరే ఊరు వెళ్ళడానికి బస్సు కోసం అని ఇక్కడికి వచ్చాను. వస్తే ఎవరో దొంగ నా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు? దాంట్లో డబ్బులు నగలు ఉన్నాయి , నాకు ఈ అమ్మాయి మీద కూడా అనుమానంగా ఉంది" అని చెప్పాడు.
"అయ్యో! సార్ నాకు అసలే కళ్ళు కనిపించవు. నాకు ఆ దొంగకి అలాంటి సంబంధం లేదు. నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్లాలి ఆ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను" అని దిగులుగా చెప్పింది సీత.
ఆ కానిస్టేబుల్ ఎక్కువగా కోపం తెచ్చుకొని ,
"పదండి , స్టేషన్ కి" అని స్టేషన్ కి తీసుకెళ్తుండగా...
"సార్! నా తప్పు చేయలేదు , నాకు ఎగ్జామ్ రాసేది ఉంది. ప్లీజ్! సార్ ఎగ్జామ్ రాసిన తర్వాత , నేను కంపల్సరీ స్టేషన్ కి వస్తాను" అని బతిమిలాడింది సీత.
సీతకి ఇంకా టెన్షన్ మొదలయ్యి ఏడవడం మొదలుపెట్టింది.
"అయ్యో మేడం! మీరు ఏడవకండి ఇది జస్ట్ ఫ్రాంక్" అని చెప్పగానే...
వెంటనే సీత కళ్ళు తుడుచుకొని ,
"ఎవరితో ఫ్రాంక్ చేయాలో తెలియదా? మీకు నేను ఏ పరిస్థితిలో ఉన్నానో మీకు తెలుసా? అందరిలా ఉండాలని నాకు లేదా! అందరిలా ఈ ప్రపంచం చూడాలని నాకు ఉండదా! నీలాగే నేనుంటే నామీద మీరు కోప్పడ్రా" అని అడిగింది.
ఆ మాటకి ,
"నన్ను క్షమించండి మేడం! ఇంకెప్పుడూ ఇలాంటి ఫ్రాంక్లు చెయ్యను" అని చెప్పి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి.
వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత బస్సు రావడంతో బస్సు ఎక్కి ఎగ్జామ్ హాల్ కి చేరుకుంటుంది సీత.
-మాధవి కాళ్ల..
హామీ పత్రం :-
ఈ కథ నా సొంతమని హామీ ఇస్తున్నాను..