ఆక్రమణ

Comments · 214 Views

ఆక్రమణ -సి.యస్.రాంబాబు

ఆక్రమణ

కలలన్నీ భుజాన వేసుకుని 
భువనవిహారం చేసొస్తుంటాను 
భువికి దివికి దీవిలా మనసు 
ఆపసోపాలు పడుతుంటుంది!

కష్టాలన్నీ ఊడ్చేసే వెలుగు కిరణం 
ఒళ్ళంతా నిమురుతుంటే 
ముసిరిన చీకట్లను విసిరేసే 
'రేసు' లో విజేతవవ్వాలంటుంది!

భావనలు బాధ్యతలు పోటీపడుతూ నడుపుతుంటే

ఒడుపుగా ఎత్తుపల్లాలు దాటడమే

 జీవితమంటూ ఉదయం హృదయాన్ని ఆక్రమించింది!

 

-సి.యస్.రాంబాబు

Comments