మనసు భావాలు

Comments · 121 Views

మనసు భావాలు -భవ్యచారు

మనసు భావాలు

మనసులో ఉన్న భయాలను,ఆలోచనలను,కావాల్సిన,ఇవ్వల్సినడైర్యాన్ని ఇవ్వకుండా ఒంటరిగా వదిలేసి వెళ్ళారు, నేను చేసిన తప్పేంటి,నాకు నచ్చిన వారికి మనసు ఇవ్వడమే నా నేను చేసిన నేరం.అవును అంతా నిజమే నన్ను కావాలి అని నా చుట్టూ తిరిగి నాతో అవసరం తీరిన తర్వాత నన్ను వదిలేసి వెళ్తాడు అని నేను కలగనలేదు కదా,అతని కోసం కన్నవారిని,తోడబుట్టిన వారిని అందర్నీ వదిలేసి వచ్చాను ,అతనితో నూరేళ్ళ జీవితాన్ని ఉహించుకున్నా, వెళ్ళిపోయానని నన్ను పూర్తిగా వదిలేసారు నా వాళ్ళు, నేను నమ్మిన వాడు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు.

ఎవర్ని నమ్మకూడదు అని అందరికి చెప్పే నేను కూడా నమ్మి , మోస పోయాను, అవును ఇది ముమ్మాటికి నా తప్పే, అయితే ఇప్పుడిది మార్గం ఈ గాలి,నేలా, ఈ చెట్టు,,చేమా ఇవన్ని నాకు తోడుగా ఉంటాయి, నన్ను సమాజం ఏమనుకోవచ్చు గాక, నేను మల్లి నా జీవితాన్ని కొత్తగా మొదలు పెడతాను, అందరిలా నేను మోసపోయానని చనిపోవడమో ,లేదా బాధ పడుతూ కూర్చోవడమో చేయను, జరిగింది ఒక పీడకల అనుకుంటాను. బాధ ఉండొచ్చు కాని దాన్ని ఇక్కడే వదిలేసి వెళ్తాను, మల్లి కొత్తగా జీవిస్తాను.

నా జీవితంలో ఇదొక గుణపాఠం అనుకుంటాను. ఇక ముందు ఎవర్ని నమ్మనా అంటే నమ్ముతాను కావచ్చు,కాకపోవచ్చు కాని నా కాళ్ళ పై నేను నిలబదతాను, తప్ప పిరికి దానిలా చావను.ఇంకేదో చేయను, నా లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా ప్రయాణిస్తా, నాకెవరూ తోడూ లేరనే విషయాన్నీ నేను మర్చిపోతాను, నేను ఒంటరిని అనే విషయాన్నీ కూడా నేనూ మర్చిపోయి మరో లోకాన్ని సృష్టిస్తా, మరో లోకం లో విహారిస్తాను అందుకు సాక్ష్యం ఈ పంచభూతాలే .

అవును ఈ పంచభూతాల సాక్షిగా నేను శపథం చేసుకుంటాను,నాకు చెప్పేవారు లేకున్నా, నను నేనే ధైర్యం చెప్పుకుంటున్నా, ఈ పంచ భుతాలకు నా మనసులో ఉన్న భావాలను పంచుకుంటున్నా, ఇవే నన్ను చివరి వరకు నడిపిస్తాయి అని నమ్ముతున్నా...

-భవ్యచారు

ఈ మనసు భావాలు నా సొంతమే అని హామీ ఇస్తూన్నాను

Comments