రాగం -భవ్య చారు

הערות · 224 צפיות

రాగం -భవ్య చారు

రాగం

నీ యదలో వాలిపోవాలని
నీ బిగి కౌగిలిలో సేద తీరాలని
నీ అనురాగ అప్యాయతల్లో కరిగిపోవాలని
ఎప్పుడు నీ అడుగుల శబ్దం వినిపిస్తుందొనని
నిశ్శబ్దంగా వేచి చూస్తున్నా చకోర పక్షిలా
నిశిధి కాంతనై నీ అనురాగాపు వెల్లువలో
తడిచి ముద్దావ్వలని నా మనసు వాకిళ్లతో తో పాటూ
మది తలుపులు కూడా తెరచి ఉంచాను నీ రాకకై

-భవ్య చారు

ఈ రచన నా సొంతమే అని హామీ ఇస్తున్నాను

הערות