ఒట్టేసి చెబుతున్నా

Comments · 214 Views

పిల్లలు పరీక్షల్లో తప్పమని ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలి.

 

 

 

ఒట్టేసి చెబుతున్నా 

 

వనజ, నారాయణ దంపతులు చాలా అనోన్య మైన జంట, వాళ్ళది పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా , ఏ గొడవలు లేకుండా , మంచిగానే అర్థం చేసుకొని ఒకరికి ఒకరుగా బ్రతుకుతున్నారు, వాళ్ళకి ఒక్కడే అబ్బాయి, ఇంకొక అమ్మాయిని కనలని ఉన్న కూడా వనజ ఆరోగ్యం సహకరించక , ఒక్క అబ్బాయితో సరిపెట్టుకున్నారు , వాడి మీదే ఆశలు అన్ని పెట్టుకొని , బ్రతుకుతున్నారు.వాడు ఇంతింతై పదిమంచి మార్కుల తో పాస్ అయ్యి , ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు వాడు వాడి చదువు తప్ప ఇతర విషయాలు ఏవి పట్టించుకోడు దాంతో వాడి మీద తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్నారు.వాడికి స్నేహితులు కూడా ఇప్పటి వరకు మంచి వాళ్లే దొరికారు, కాబట్టి వాడు చేడు మార్గం లోకి వెళ్ళలేదు, ఇప్పుడు కాబట్టి ఎలాంటి వాళ్ళు స్నేహితులు అవుతారో,తెలియదు మరి , అభి తన తండ్రిని బైక్ కొనివ్వమని అడిగాడు, ఎప్పుడూ ఏది అడగని కొడుకు బైక్ అడిగేసరికి తండ్రి చాలా సంతోషపడి అలాగే అని అన్నారు. తల్లి వద్దు అని అంటున్నా , చదువుతున్న కొడుక్కి అవసరం ఉంటుందని కొన్నారు నారాయణ గారు , తల్లి వనజ కు బైక్ మీద కొడుకు వెళ్తుంటే గుండెలు అదురుతుంటాయి.

 బస్ పాస్ ఉండగా బైక్ ఎందుకండి అని వనజ ఎంత మొత్తుకున్నా బస్ టైం కి రాదు అని, ఎలాగో తల్లిని మభ్య పెట్టి మరి కోనిపించాడు.తల్లి అభి తో డాడీ నీకు బైక్ కొని ఇచ్చారు, నువ్వు మాత్రం చదువులో మాత్రం ఫస్ట్ రాంక్ తెచ్చుకొని , మన బంధువులో మంచి పెరు తేవాలి అని అన్నది, సరే నమ్మ అని అభి కూడా బాగా చదవసాగాడు. అభి ఫ్రెండ్స్ కూడా చదువులో పడి , అసలు బయటకు రావడమే మానేశారు , ఇంట్లో లేచిన దగ్గరనుండి, చదువు, చదువు , అదే పని ఒక్క తినడం, బాత్రూం కి వెళ్లే టైం లో తప్ప మిగతా అంతా చదువుకు కేటాయిస్తున్నారు.చివరికి పరీక్షలు మొదలు అయ్యాయి, అందరూ బాగానే రాస్తున్నారు, అయినా ఎదో ఒక భయం అందర్లోనూ , భయం భయం గా రాసినా చాలా బాగా రాసారు అందరూ , ఒక నెల రోజుల తర్వాత result వస్తాయని , పరీక్షలు అయిపోయి న సంతోషం లో అంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు...

 

 తెల్లవారితే result వస్తాయి , ఆ రాత్రంతా దాదాపు అందరూ సగం సగం నిద్ర పోయి ,ప్రొద్దున్నే 5 గంటలకి లేచారు , ఆత్రంగా, తమ ఫలితాలు ఎలా వస్తాయో , అని అనుకుంటూ, అందరూ నెట్ సెంటర్ కి వెళ్లారు, దాంతో నెట్ సెంటర్ లు అన్ని కిటకిటలాడి, పోతున్నాయి.అభివాళ్ళ నాన్న కూడా ఆ నెట్ సెంటర్ ముందే ఉన్నారు , వారికన్నా ముందు వచ్చిన వారు,చూసుకుంటున్నారు, ఇంతలో ఒక అమ్మాయి ఏడుస్తూ వచ్చింది , ఏమైంది ఏమైంది అని అందరూ అడుగుతుండగానే ఆమె గబ గబ పరుగెత్తుకుని వెళ్లి ఎదురుగా ఉన్న పెద్ద బిల్డింగ్ మీదికి వెళ్లి అక్కడనుంచి దూకింది . అందరూ చూస్తుండగానే ఆ అమ్మాయి రక్తం మడుగులో పడి గిలాగిలా కొట్టుకుని చనిపోయింది. అది చూస్తున్న అభి తండ్రి గుండె లో బాధగా అనిపించింది, తన కొడుకు కూడా పాస్ కాకపోతే ఇలాగే చనిపోతాడా? అన్న ఆలోచనతో తర్వాత వచ్చి చూసుకుందాం, అని అభి ని తీసుకొని వెళ్తుండగా , అయ్యో ఆ అమ్మాయి చాలా బాగా చదివే ది, ఫెయిల్ అయ్యింది అని వచ్చిందట ఆన్లైన్ లోవాళ్ళు బయటకు వెళ్తున్న పది నిమిషలలో ఒక పది మంది స్టూడెంట్స్ ఏడుస్తూ వెళ్లారు. తెల్లారి న తర్వాత టీవీ లో పేపర్ లో ఎక్కడ చూసిన స్టూడెంట్స్ ఆత్మహత్య లు వినిపిస్తున్నాయి, govt తప్పు వల్ల అలా జరిగిందని ప్రజలు , మా తప్పు లేదు , మేము అప్పగించిన వాళ్ల తప్పు అని govt, వాళ్ళు అని తప్పించుకున్నారు, ఇక ఫెయిల్ అయిన వాళ్ళను పాస్ చేయడం , మంచి రాంక్ వచ్చే వాళ్ళను ఫెయిల్ చేయడం జరిగింది.

 ఇదంతా చూస్తున్న నారాయణ , వనజ గార్లు భయపడి, తమ కొడుకు ఫ్రెండ్స్ తల్లిదండ్రులు లను , పిల్లలని పిలిపించి అందరిని కూర్చోబెట్టి , మీకు కొన్ని విషయాలు చెప్తాను , వింటారు కదా ఆని అనగానే అయ్యో అన్నయ్య గారు , మీరు అనుభవం కలవారు మీరేం చెప్పిన మేము వింటాం అన్నారు ఒక్కసారిగా 

నారాయణ గారు గొంతు సవరించుకొని, చూడండి మన పిల్లలని మనం ఎంతో ప్రేమగా పెంచుకున్నాం,అలాగే వాళ్ళ భవిష్యత్తు మీద కూడా ఆశ పెట్టుకొని , డబ్బు ఖర్చు పెట్టి చదివించము, వాళ్ళను తొమ్మిది నెలలు మోసి, కనీ ,పెంచి , ఇంతవాళ్ళని చేస్తే , ఇప్పుడు ఎవరో ఒకరు చేసిన తప్పు వల్ల, చాలా మంది పిల్లలు ఆత్మహత్య లు చేసుకున్నారు, చేసుకుంటున్నారు, అలా కాకుండా ఉండాలంటే మనమంతా మన పిల్లలని కనిపెట్టుకుని ఉండాలి, అలాగే వాళ్ళుకి ధైర్యం చెప్పాలి, ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా పరీక్ష రాసి పాస్ అవ్వొచ్చు , కానీ ప్రాణం ఒక్కసారి పోతే తిరిగి రాదు , అందువల్ల మన పిల్లలతో మనం ఒట్టు పెట్టించుకోవాలి , ఏమంటారు అని ఆగి అందరిని తేరిపారా చూసారు, అవునండి అని అందరూ ఒక్కసారిగా మాట్లాడం మొదలు పెట్టారు, అవునండి govt వాళ్ళు చేసిన తప్పుకు మన పిల్లలని ఎందుకు బలవ్వాలి, మీరు చెప్పింది చాలా బాగుంది , అని పిల్లలందరిని ఒక్క దగ్గరికి పిలిచి అందరితో ఒట్టు వేయించారు. ఎలాంటి పరిస్థితి లో అయిన ఆత్మహత్య , చేసుకోమని , ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకుని ,నిలబడతామని , తల్లి , తండ్రి చేతుల్లో చెయ్యేసి ఒట్టేసి చెబుతున్నాం , మేము ఆత్మహత్య లు చేసుకొము అని గట్టిగా అంటూ , ఒట్టు పెట్టారు.ప్రస్తుతం govt లేదా ఎవరో చేసిన తప్పుకు చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య లు చేసుకున్నారు. వాళ్ళు ఒక్క క్షణం ఆలోచించి ఉంటే తమ నిండు జీవితాన్ని కోల్పోయేవారు కాదు..

 

భవ్యచారు 

 

Comments
Venkata Bhanu prasad Chalasani 36 w

యదార్థ సంఘటనలు వ్రాసారు.