తెలుగు భాష ఔన్నత్యం

Comments · 299 Views

తెలుగు భాష ఔన్నత్యం-రుద్రపాకసామ్రాజ్యలక్ష్మి

తెలుగు భాష ఔన్నత్యం

 

తెలుగువారందరికీ తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు.

తీయ తేనియలూరు తెలుగు భాష మనది.

పలుకు పలుకున రస గంగ ఒలుకు భాష మనది.

ఏ భావమైనా తేలికగా ధారా ప్రవాహంగా ఒప్పు భాషమనది.

ఏబది అక్షరాలు బీజాక్షరాలుగా ,లలితా సహస్రము న పలుకు భాషమనది.

ఏ మాండలీకమైన, ఏయాస పలుకు ముచ్చట

గొలిపే ముద్దులొలుకు తెలుగు భాష మనది.

చక్కని నుడికారాలు,సామెతలు ,

ద్విత్వాక్షరాలు,అచ్చులు,హల్లులు,ఛందస్సు,

వ్యాకరణము,అలంకారముల సమ్మిళితం మన తెలుగు భాష.

పద్యంలో,గద్యంలో,పాటలో,జానపదం

లో,సంగీతంలో,సాహిత్యంలో ఒదిగి నవరసాలను ఒలికించే భాష మనది.

ఎందరో కవులు,అన్నమయ్య,త్యాగయ్య,

రామదాసు గేయ కర్తలుగా తెలుగులో తేనె పోసి,

రకరకాల మేళ కర్త రాగాలతో తెలుగు గీతాలు అన్నిభాషల వారు

ఆనందంగా పాడుకుంటున్న

మన తెలుగు తల్లిని ఎన్ని నోళ్ళకొనియాడిన తక్కువే కదూ!

మన తెలుగు తల్లికి మల్లెపూదండతో

రాయప్రోలు అర్చించి,మనకు మార్గదర్శకులయ్యారు.

అది ఉభయ తెలుగు రాష్ట్రాల కి జాతీయగీతమయ్యింది.

రాయల వారు ఏనాడో చెప్పారు

దేశభాషలందు తెలుగు లెస్స అని.

వృత్తంలో ఇమిడే అక్షరాల 
సముదాయం ,దస్తూరికి అలంకరణ.

వచ్చిందన్నా,వచ్చాడన్నా
నా వరాల తెలుగు ఒకటేనన్నా.

జై తెలుగుతల్లి,జై జై తెలుగుతల్లి.

-రుద్రపాకసామ్రాజ్యలక్ష్మి

Comments
Venkata Bhanu prasad Chalasani 42 w

చాలా బాగా వ్రాసారు.