సాయి చరితము -236 -సి.యస్.రాంబాబు

Comments · 173 Views

సాయి చరితము -236 -సి.యస్.రాంబాబు

సాయి చరితము -236

పల్లవి
నీ నీడే చాలని 
నీ పేరే తోడని 
కొలిచేము నిన్ను సాయి 
కాపాడు మమ్ము సాయి 

చరణం
మా కలయే నీవని 
ఇలలోన వెతికితిమి 
షిరిడీయే స్వర్గమని 
తెలిసెనుగా 
సద్గురువుని సేవలో 
తరియించే భాగ్యము చాలునుగా 
సాయి అన్న పిలుపుతో 
సర్వము మేం మరిచెదము 

చరణం
సాధారణ జీవనమే 
మనకు ఎంతో మేలని 
ఏనాడో చెప్పెనుగా 
జీవులన్ని ఒకటనని 
ప్రేమ ఒకటే సత్యమని 
బోధనలే చేసెనుగా
తన చరితము చదివినచో 
అదియే మనకు తెలియునుగా 

చరణం
స్వార్థమే పెరిగెనుగా
మంచితనము మరచితిమి 
సౌఖ్యమే పెన్నిధిగా 
సాగుతున్న మనుషులను 
మార్చవయ్య సాయి 
మము మన్నించుము సాయి 
నీ బాటన నడిచేందుకు 
శక్తినొసగు సాయి..సన్మతినీయుము సాయి 

-సి.యస్.రాంబాబు

Comments