*సాయిచరితము -256*
*పల్లవి*
గురుసాయముతో నడిచితిమంటే
గురుదీవెనలే కాపాడునుగా
గురునామమునే స్మరణే చేసిన
కష్టాలన్ని తీరుట తథ్యము
*చరణం*
జీవనమార్గము కఠినము భాయి
గురుమార్గముయే దానికి దారి
పగలు రేయి సాయిని తలిచిన
మనసుకు శాంతి మహిలో భాయి
*చరణం*
గురునామముయే తారక మంత్రము
నిను కాపాడే సాధన యంత్రము
సద్గురు సాయి మనసే నిండగ
బతుకే పండగ..నిత్యము పండగ
*చరణం*
చపలత్వముతో నిండిన మనసును
సద్గురు సాయి మార్చును తెలుసుకో
గురు బోధనలే మార్గము చూపగ
నీలో మార్పులు నీకే తెలియును
*చరణం*
మానవజన్మకు న్యాయము చేసిన
తీరును కాదా సద్గురు ఋణము
సద్గురు బోధలు వినుటే కాదు
అవి పాటించుటే నీ లక్ష్యముగా
సి.యస్.రాంబాబు
7/11/24