తుపాకిగొట్టంతోనా సోదరభావం!
కొన్ని బ్రతుకుల్ని చిదిమేసి
ఉరికంబం ఎక్కేవాన్ని క్షమిస్తే
సమసమాజంలో దుష్టులకు కొమ్ముకాయడమే!
మానవ బాంబులతో ఉగ్రవాదం పెట్రేగుతుంటే
మానవ సంస్కృతి సంప్రదాయాలకు కుంపటి రాజేస్తూ
విదేశీ శక్తులు మనుషులను పురుగుల్లా నలిపేస్తుంటే
దేశీయ మిలటరీ బలగాలు సమర్థంగా ఎదుర్కొంటున్న
నూటాముప్పై కోట్ల భారతావనిలో ఎదో ఒక పట్టణంలో
అమాయకులు,మహిళలు ఉగ్రవాదంకు బలియవుతూ
ఈ నీచ నికృష్ట సంస్కృతిని పెంచి పోషించే దేశాలు
తమ దేశాల్లో పేదలకు కూడు గుడ్డ ఇళ్లు సమకూరిస్తే
సుసంపన్న దేశాలుగా ఎదుగుతాయన్నది తెలియనిదా!?
ఎంతసేపు ఉగ్రవాదుల చొరబాట్లు కాల్పులు చంపుకొవడాలు
చదువు సంధ్యల్లేని అభాగ్యులను బలి చేసే దేశాల మూర్ఖత్వం!
మతం మతం అంటూ మంటగలుపుతున్న మానవతా విలువలు
హిందూ ముస్లిం క్రైస్తవం ఎవరికి వారు ఆలోచించుకోండి
మనమంతా విశ్వమానవులం విజ్ఞత గలిగిన మనుషులం
మనుషులను మనుషులే చంపుకుంటే ఏ దేవుడు దీవిస్తాడో ఆలోచించండి!
ధుఖపు కోరల్లో కుటుంబాలకు కుటుంబాలు బలి అవడం తగదు
ప్రపంచ మానవుల సౌభ్రాతృత్వం వెలుగులు పంచాలి
ధనస్వామ్యము సామాన్య జనుల శ్రమతోనే ఎదిగిందని మరవద్దు!
-అపరాజిత్
సూర్యాపేట
ఆనందాల సంవేదనలు!
బంగారంతో పోతబోసిన చందం
ఏ గాయం లేని నీ కాయం!
నిలువెల్లా వలువలు కప్పుకున్న దేహం
మనసు కౌగిటిలో మునిగిన వెన్నెల సొగసులు
కన్నీరు పన్నీరై నిరాశల నుండి ఆశావాదంలోకి
ఆకాంక్షలు వెన్నెలలో పూసిన జాజిమల్లెలు!
దీనుల ఆర్తనాదాలు పగిలి పొగిలిన వీణానాదం
అరవిరిసిన బంగరు రంగుల కమలం కాంతులు
మనసును చంపే తీతువు పలికే నీతులు
వేగి వేగిన మంటల దేహం వెన్నెలలోసేదదీరిన చందం!
ముసుగు దొంగ మీదపడ్డట్లు వడగండ్ల వాన
తామరపూల చందం తనువెల్లా పూసిన పలవరింత
అర్ధనారీశ్వరుని నర్తనం ఓ వెండిపూల శోభ
ఇచ్ఛ ఈశ్వరుడై జీవితమంతా మధురిమల పూదోట
దొంగాటలాడే వెన్నదొంగకే చెల్లు మాయదారి మోసాలు
రోదించే మదిని పూల పరిమళాల వెలుగులు నింపాలి!
ఆకలిగొన్న అనాధునికి ఇవేవీ పట్టవు పట్టెడన్నం చాలు
కాయకస్టం చేసే రైతు మదిలో ఏపుగా ఎదిగిన చేలు
విసుగన్నది లేక రచనలు చేసే కవి హృదయంలా!
వేయి పున్నమల్లా వేణుగానం వీణుల విందు
నిరుద్యోగి కన్న కలలు కన్నీటి ఏరులై పారగా
చదువుల సరస్వతి తెల్లచీర పయిట
కొంగుపై లిఖించిన సిందూర అక్షర కణికలు
వెలుగుల బావుటాయైన సూరీడు!
-అపరాజిత్
సూర్యాపేట
జనవరి 20
చరిత్రలో ఈ రోజు ప్రాముఖ్యతలు
•1265: లండన్లోని వెస్ట్మినిస్టర్భవనంలో ఇంగ్లాండు పార్లమెంటు తొలిసారిగా సమావేశమైంది.
•1900: సంస్కృతాంధ్ర పండితుడు, ప్రముఖ తత్వవేత్త పరవస్తు వెంకట రంగాచార్యులు మరణం (జ.1822).
•1907: సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు బందా కనకలింగేశ్వరరావు జననం (మ.1968).
•1940: తెలుగు సినిమా కథానాయకుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జననం (మ.2022).
•1957: భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సర ను ట్రాంబే లో ప్రారంభించారు. (చిత్రంలో)
•1960: తెలుగు సినిమా హాస్య నటుడు, రాజకీయవేత్త విజయ నరేష్ జననం.
•1964: భారతీయ-అమెరికన్ పాత్రికేయుడు, రచయిత ఫరీద్ జకారియ జననం.
•1995: తాజ్మహల్ చుట్టుపక్కల ఉన్న 84 కాలుష్యకారక పరిశ్రమలను మూసేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
చరిత్రలో ఈ రోజు
జనవరి 19 ప్రాముఖ్యతలు
•యోగివేమన జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహిస్తుంది.
•1736: శాస్త్రవేత్త, ఆవిరి యంత్రంతో ప్రాముఖ్యత పొందిన జేమ్స్ వాట్ జననం (మ.1819).
•1905: భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం (జ.1817).
•1918: తెలుగు పండితుడు, రచయిత, వక్త, విమర్శకుడు వావిలాల సోమయాజులు జననం (మ.1992).
•1920: ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్ జననం (మ.202.
•1946: అమెరికా గాయని, పాటల రచయిత, రచయిత, బహుళ పరికరాల వాద్యకారిణి, నటి, దాత డాలీ పార్టన్ జననం.
•1972: భారత క్రీడాకారుడు వినోద్ కంబ్లీ జననం.
•1990: భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో మరణం (జ.1931).