ప్రేమ సందేశం

Comments · 158 Views

ప్రేమ సందేశం,శీర్షిక:⁠- ఊహసుందరి -మాధవి కాళ్ల..

ప్రేమ సందేశం

శీర్షిక:⁠- ఊహసుందరి

నా స్వప్నంలోకి వచ్చిన ఓ ఊహసుందరి 
నీ జాడ వెతుకుతున్నా...
జాతరలో కనిపించి నీ దగ్గరకు చేరేలోపే అయ్యావు మాయం...
నా కళ్ళు నీ కోసం చూసి చూసి అలసిపోయి
నీ నవ్వు గలగల నా చెవిన చేరిన
నువ్వు అని గుర్తించలేకపోయా...
నీ స్వరం నా మదికి చేరిన కూడా 
నీ జాడ వెతుకులాట ఆపడం లేదు నా చెలి 
నా ప్రేమ ఎప్పుడు నీ మదికి చేరునో అని ఎదురు చూస్తూ 
నీ స్మృతులను తలుచుకుంటూ నా ప్రేమ సందేశం ఎలా నీకు చేర్చలో తెలియక మదన పడుతున్నా ఈ క్షణాన...
ఉత్తరం ద్వారా పంపించాన నీ చిరుమానా తెలియదే
కాకితో కబురు పంపించాన  నీ జాడ తెలియదు...
కోకిల స్వరాలతో పంపించాన నీ స్వరం తెలిసిన
ప్రతి రోజు నా స్వప్నంలో సాక్షాత్కరించి 
నీ రూపం మాత్రం కనిపించకుండా ఉంటూ
నన్ను ఇంకా ఇంకా కలవరానికి గురిచేస్తూ
నీ ప్రేమ సందేశం కోసం ఎదురు చూసేలా చేస్తూ ఉన్నావ్...

-మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను..

Comments