చిత్ర కవిత్వం 

코멘트 · 248 견해

చిత్ర కవిత్వం  శీర్షిక : సూర్యాస్తమయం -వెంకట భాను ప్రసాద్ చలసాని

చిత్ర కవిత్వం 

శీర్షిక 
సూర్యాస్తమయం 

వస్తూనే హడావుడి చేసేసి
మనందరినీ లేపేసే సూర్యుడు
అస్తమించేటప్పుడు ఎంతో 
హుందాగా నిష్క్రమిస్తాడు.
సూర్యోదయానికి స్వాగతం 
చెప్పే మనం సూర్యాస్తమయం
కాలంలో మౌనంగా ఉంటాము.
మన పుట్టుక సూర్యోదయం. 
అస్తమయం సూర్యాస్తమయం.
భానుడి కిరణాలు మన శరీర ఆరోగ్యం మెరుగుపరుస్తాయి.
సూర్యాస్తమయం మన
రేపటి భవితకు పునాది ‌

ఈ రచన నా స్వీయ రచన 

-వెంకట భాను ప్రసాద్ చలసాని

코멘트