జోకర్..
సర్కస్ లో జోకర్ లా వేషం
వేసి నవ్విస్తాడు జోసఫ్
నిజ జీవితం లో కష్టాలతో
పోరాడు తాడు ప్రతి నిత్యం
అమ్మా నాన్న ల రోజూ తిట్లు
అయ్యాయి అవి జీవిత మెట్లు
తిట్టేమెా దీవెన అయ్యింది
మెట్టేమెా ఒక్కొక్కటి ఎక్కాడు
ఏ ఉధ్యోగం లేక సర్కస్ లో
చేరాడు నవ్వుల రాజై
నిలిచాడు పేరేమెా పెద్దగ
గడించాడు డబ్బులేమెా నిల్
వచ్చిన డబ్బులు ఎటూ
సరిపోవు తెచ్చిన జీతం
అప్పుల కే పరిమితం
అయినా నవ్వులే అతనికి అందం
నవ్వు లేమెా నానా రకాలు
అప్పులేమెా హాహా కారాలు
ఇంటికెల్తే వచ్చేవి దుఖః భారాలు
వెళ్లక పోతే పస్తులే ఆకలి ఘోరాలు
దిన దిన గండం జోసఫ్ జీవితం
ప్రతి దినం నవ్వుల గుండం జీవనం
నవ్వక పోతే ఆ మాత్రం బ్రతుకు లేదు
నవ్వుతూ బఃరతకాలి రా తమ్ముడూ!!
- ఉమాదేవి ఎర్రం
