అంశం
రాఖీ పూర్ణిమ సందర్భంగా
నిర్వహించే అన్నా చెల్లెలి అనురాగం పై
కధ
శీర్షిక
రాఖీ కడతాను రా
రాము, బాల అన్నా చెల్లెళ్ళు. చిన్నతనం నుంచి కలిసిమెలిసి ఆడుకున్నారు. కలిసి
చదువుకున్నారు. వారి
ఇరువురి మధ్య పెద్దగా
వయసు తేడా లేదు.
బాల తన అన్నకంటే రెండేళ్ళు చిన్నది. అందుకే అన్నాచెల్లెళ్లలా
కాకుండా స్నేహితుల వలె కలిసి మెలసి ఉండేవారు. వారిరువురి మధ్య పోట్లాటలు
అతి సహజంగా జరిగేవి.
మళ్ళీ త్వరగానే కలిసి
పోయి చాలా చక్కగా ఆడుకుంటూ ఉండే వారు. ఇక రాఖీ పండగ వచ్చిందంటే చాలు ఆ ఇంట్లో హడావుడి గురించి చెప్పనవసరం లేదు. అన్నా చెల్లెలు ఇద్దరు హాయిగా ఆనందంగా పండగ జరుపుకునే వాళ్ళు. బాల తన చేతితో స్వయంగా రాఖీ తయారు చేసి అన్నకు కట్టడానికి సిద్ధం చేసేది.
రాము కూడా తన చెల్లి కట్టిన రాఖీ కోసమే ఎదురు చూస్తూ ఉండేవాడు. ఏడాదంతా తండ్రి ఇచ్చిన పాకెట్ మనీ డబ్బులు దాచుకుని దానితో ఒక బహుమతి కొని చెల్లికి ఇచ్చేవాడు. అలా వారు ఎంతో ఆనందంగా పండగ జరుపుకునే
వారు. అలా సమయం గడిచిపోయింది. వారు పెద్దవారు అయ్యారు.
పెళ్ళిళ్ళు కూడా జరిగాయి.
ఎవరి కాపురం వారిదే.
పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.వాళ్ళలో స్వార్ధం పెరగటం మొదలైంది. ఎవరి కాపురం వారిదే. తల్లిదండ్రులు కూడా
తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అప్పుడు
ఆస్తుల పంపకాల గురించి
ఇద్దరి మధ్య పోట్లాటలు మొదలయ్యాయి. వారి
కుటుంబ సభ్యుల
మాటలు కూడా
ఇద్దరి మధ్య దూరం
పెరిగేందుకు దోహదం
అయ్యాయి. అలాంటి
సమయంలో రాఖీ
పౌర్ణమి వచ్చింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నా
కూడా రక్తసంబంధం పోదు
కదా. చెల్లి తన అన్న వస్తాడు
అని ఎదురు చూస్తూ ఉంది.
అన్న కూడా తన చెల్లి
పిలుస్తుంది అని ఎదురు చూస్తూ కూచున్నాడు. బాల తన అన్నయ్యకి ఫోన్ చేసింది *అన్నయ్య రాఖీ కడతాను రా" అని ఫోన్లో చెప్పింది అదే మాట కోసం ఎదురుచూస్తున్న రాము ఆగమేఘాల మీద తన వాహనంపై తన చెల్లెలు ఇంటికి వచ్చాడు తన తోబుట్టువుతో ప్రేమగా మాట్లాడాడు. తన బావగారిని గౌరవించాడు. ఈరోజు నుంచి మన మధ్య ఏ రకమైన మనస్పర్ధలు ఉండకూడదు అని మనస్పూర్తిగా చెప్పాడు అలా ఒక రాఖీ పండగనాడు అన్నాచెల్లెళ్ళు మళ్ళీ కలిశారు. అదే విధంగా తన చేతితో చేసిన రాఖీని తన అన్నకు కట్టింది. అన్న కళ్ళలో ఆమెకు ఆనందభాష్పాలు కనిపించాయి. బాల
మనసులోనే అన్నయ్యకి
నమస్కరించింది.
ఈ రచన నా స్వీయ రచన
వెంకట భాను ప్రసాద్ చలసాని