అంశం
ఈ రోజు చిత్ర కధ
శీర్షిక
నేనున్నాను అమ్మా.
ప్రతిరోజూ ఉదయం లేచి
ఇంటిల్లిపాదినీ లేపే అమ్మ
ఆ రోజు లేవలేదు. అందువల్ల రాము
మనసులో భయం మొదలైంది. రోజూ
ఉదయం ఐదింటికి
లేచి ఇంటిపనులు
చేస్తూ అందరినీ లేపి
అందరికీ కాఫీ, టిఫిన్లు
అమర్చి పెట్టే అమ్మ
లెగవకపోవటం ఎన్నో
అనుమానాలకు దారి
తీసింది. రాము వెంటనే
తన తండ్రి రఘపతికి తెలియజేశారు ఆయన ఖంగారు పడుతూ తన భార్య రవళి దగ్గరికి వచ్చాడు. నుదిటిపై చేయి వేసి చూశారు. రవళి కళ్ళు మూసుకు పడుకొని ఉంది. పిలిస్తే కూడా పలకడం లేదు. వెంటనే రఘపతి అంబులెన్స్ కి ఫోన్ చెయ్యి అని రాముకి చెప్పాడు. రాము ఖంగారుగా అంబులెన్స్ కి ఫోన్ చేశాడు. అంబులెన్స్ వచ్చే లోపు ఇంటి చుట్టుపక్కల వారు కూడా వచ్చారు. వారు చాలా ఖంగారు పడ్డారు. చుట్టుపక్కల వారందరికీ తలలో నాలుకగా ఉన్న రవళి ఇప్పుడు ఇలా స్పృహలో లేకపోవడం వారిని కలచి
వేసింది . ఈలోపు రఘపతికి బి.పి డౌన్ అయ్యింది . అలాగే కుర్చీలో కూలబడ్డాడు. ఒకవైపు తల్లి, మరొకవైపు తండ్రి ఇలా తలొక వైపు ఇంట్లో స్పృహ కోల్పోయి ఉన్నారు. రాము ఎలాగో ధైర్యం తెచ్చుకుని అంబులెన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. వారి ఇల్లు సిటీకి దూరంగా ఉండటం వల్ల ఆంబులెన్స్ రావటం ఆలస్యం అయ్యింది. రాము తన తండ్రి రఘపతికి కాఫీ కలిపి ఇచ్చాడు. రఘుపతి కొంత కోలుకున్నాడు. ఈ లోపు అంబులెన్స్ వచ్చింది. రవళిని అంబులెన్స్ లోకి ఎక్కించారు. దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకు వెళ్ళారు . హాస్పిటల్ కి తీసుకు వెళ్ళినాక కూడా రవళి కళ్ళు తెరవలేదు. డాక్టర్లు ఆమెను పరీక్ష చేయడం మొదలు పెట్టారు.
రఘపతి హాస్పిటల్ ఖర్చుకు డబ్బు సమకూర్చుకునే పనిలో అయిన వాళ్ళకు ఫోన్ చేస్తున్నాడు. టెస్ట్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి సాయంత్రం
అయ్యింది .అప్పటివరకు కూడా రవళి కళ్ళు తెరవలేదు. మరిన్ని టెస్ట్లు చేయించమని డాక్టర్లు సలహా ఇవ్వండంతో రాము అందుకు సిద్ధపడ్డాడు. రాము బంధుమిత్రులు వచ్చి పలకరించడం మొదలుపెట్టారు. వారు కొంత డబ్బు రఘుపతికి ఇచ్చి వెళ్ళారు. మరింత
సహాయం చేస్తాం అని
వాగ్దానం చేసారు. మిగతా టెస్ట్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి రెండు, మూడు రోజులు పట్టింది. టెస్ట్ రిజల్ట్స్ చూసి డాక్టర్లు రాముని పిలిచారు. ఆ వచ్చిన టెస్టు రిజల్ట్స్ రాముకి చెప్పారు .అమ్మకి క్యాన్సర్ అని చెప్పారు. రాము హతాశుడయ్యాడు
అతనికి చాలా బాధ కలిగింది . ఎలాగో ధైర్యం చేసుకుని నిదానంగా తన తండ్రికి ఆ వివరాలు చెప్పాడు . రఘపతి ఉసూరుమంటూ నేలపై కూర్చున్నాడు. రాము కూడా తండ్రి పక్కనే కూర్చున్నాడు.
అతనికి తన చిన్న చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. చిన్నప్పుడు తనకు బాగోలేనప్పుడు అమ్మ నిద్రపోకుండా తన పక్కనే కూర్చుని తనకు సేవ చేసింది. రెండు రోజులు అలాగే తన పక్కనే కూర్చుంది . తన ఆరోగ్య సమస్య తీరే వరకు తనతోనే ఉంది.
అవన్నీ గుర్తుకు వచ్చి రాము బాధపడుతూ ఉన్నాడు. చివరి టెస్టు వివరాలు చూసిన డాక్టర్ అమ్మ చివరి దశకు చేరుకున్నదని చెప్పాడు. ఎంత ప్రయత్నించినా అవకాశాలు తక్కువగానే ఉన్నాయి అని చెప్పాడు. అయినా కూడా ప్రయత్నించి చూద్దాం అని రఘపతి భావించాడు.
హాస్పిటల్ లో చేరిన మూడో రోజుకి రవళి కళ్ళు తెరిచింది తన కొడుకు, భర్త దిగాలుగా ఉండడం చూసి చాలా బాధపడింది.
అసలేమైందని తన భర్తను అడిగింది. రఘుపతి మౌనంగా ఉండి పోయాడు. రాము కూడా మౌనంగా ఉండిపోయాడు. అసలు విషయం ఏంటో చెప్పమని తన మీద ఒట్టు వేయించుకుంది రవళి అప్పుడు వారికి విషయం చెప్పక తప్పలేదు. విషయం తెలుసుకున్న రావళి మొదట్లో భయపడింది. ఆ తర్వాత
ధైర్యం తెచ్చుకుని తన భర్తకు, తన బిడ్డకు ధైర్యం చెప్పసాగింది. ఇంకా మెరుగైన వైద్యం వద్దని, తాను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పింది. రఘుపతి అందుకు ఒప్పుకోలేదు.
"ప్రయత్నం చేస్తే తప్పు లేదు కదా. ప్రయత్నం చేద్దాం అని" భార్యతో అన్నాడు. వైద్యం ఎంతో ఖర్చు పెడుతున్న వ్యవహారం కాబట్టి, అవకాశాలు కూడా తక్కువే ఉన్నాయి కాబట్టి ప్రయత్నం వద్దని చెప్పింది.
రాము ఆమె మాట వినలేదు. డాక్టర్ దగ్గరకి వెళ్లి తన అమ్మకు మరింత మెరుగైన వైద్యం అందించమని కోరాడు.
వారు అందిస్తామని చెబుతూనే అమ్మ ఆరోగ్యం మెరుగు అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పారు.
అలా వారి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు.
రాముకు చిన్నతనం తన తల్లి తనకు చేసిన సేవలను గుర్తుకొచ్చాయి.
ఉదయాన్నే లేచి తనకు, తన తండ్రికి కావాల్సినవన్నీ అమర్చి పెట్టే అమ్మకి ఇప్పుడు ఇలా అయినందుకు
ఎంతో బాధపడ్డాడు.
రఘుపతి కూడా బాధ
పడుతున్నా భార్య ముందు ధైర్యం నటిస్తూ ఉన్నాడు. ఇలా రోజులు
గుడుస్తూ ఉన్నాయి.
రాము అమ్మ ఆరోగ్యం
మరింత పాడయ్యింది.
డబ్బులు మంచినీళ్ళలా ఖర్చవుతున్నాయి. అయితే ఏమీ ప్రయోజనం కనబడటం లేదు. అప్పులు కూడా చేయటం మొదలుపెట్టారు. ఇల్లు కూడా తాకట్టు పెట్టటానికి సిద్ధపడుతూ ఉన్నారు.
ఈ విషయాలన్నీ రవళికి తెలియకపోయినా తన భర్త తన కుమారుడు బాధపడుతున్నారనే విషయం అర్థమైంది.
ఆమె ఏమీ చేయలేని పరిస్థితి. తనని త్వరగా తీసుకుని పొమ్మని ఆ భగవంతున్ని వేడుకొంది.
అలాంటి స్ధితిలో రాముకి
కొందరు సలహా చెప్పారు.
విదేశాలకు తీసుకుని
వెళ్ళి అక్కడ వైద్యం
చేయించమని చెప్పారు.
అక్కడైతే మంచి వైద్యులు మంచి హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి అమ్మ మెరుగయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పారు.
అయితే రాముకి విదేశాల్లో తెలిసిన వారు ఎవరూ లేరు. అంత ఆర్థిక స్తోమత కూడా లేదు. ఈలోపు ఒక అద్భుతం జరిగింది. అమ్మ
చిన్నతనంలో తనతో పాటు ఒక అనాధకు
అన్నం పెట్టేది. ఆ బాలుని
తల్లి చనిపోవడంతో ఆ
అబ్బాయికి అమ్మే
అన్నం పెట్టేది. అలా
చాలా కాలం పెట్టింది.
చివరకు ఆ అబ్బాయి
తండ్రికి విదేశాల్లో ఉద్యోగం
రావటంతో కొడుకును
తీసుకుని విదేశం వెళ్ళి
పోయాడు. ఇప్పుడు ఆ
అబ్బాయి అమెరికాలో మంచి స్ధితిలో ఉన్నాడు
అని తెలిసింది. అతనికి
ఫోన్ చేసి విషయం చెప్పాడు. విషయం తెలుసుకున్న ఆ అబ్బాయి
రవి చాలా బాధ పడ్డాడు.
అమెరికాలో ఉన్న అతను
తన దగ్గరకి వచ్చేయమని.
రాముకు చెప్పాడు. రాము
తన తల్లిని తీసుకుని రవి
వద్దకు వెళ్ళాడు. వెంటనే
రవి అమెరికాలో ఉన్న
మంచి హాస్పిటల్లో రాము
అమ్మని చేర్పించాడు.
చాలా కాలం పట్టినా
అమ్మ ఆరోగ్యం మెరుగుపడింది.
చిన్నప్పుడు ఎప్పుడో
తన చేతితో అన్నం పెట్టిన
అమ్మ రుణం తీర్చుకునే
అవకాశం దొరికినందుకు
రవి సంతోషించాడు.
రవళి దగ్గరికి వెళ్ళి "అమ్మా నేనూ నీ
కుమారుడినే అనుకో.
చిన్నప్పుడు నాకు
గోరుముద్దలు తినిపించి
నా ఆకలి తీర్చావు. అమ్మ
లేని లోటు తీర్చావు.
నీకు నేనున్నా అమ్మా"
అని అన్నాడు. అమ్మకు
ఆరోగ్యం మెరుగుపడటంతో ఆమె మళ్ళీ తన ఇంటికి వచ్చేసింది. దేవుడు
పంపిన బిడ్డ తనను
కాపాడాడని మనసులో
ఎంతో సంతోషించింది.
చివరకు కధ సుఖాంతం
అయ్యింది.
ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని
Baca selengkapnya