జాతక చక్రవర్తివని శంకర మీకివె జోతలిత్తునే!
మాతగ పార్వతమ్మకిట మానుషులెల్లను పూజసేయగన్!
నూతన జీవితమ్మొసగ నోరిమి తోడను మాకు నెల్లెడన్
శీతలమానసమ్ముగను శీఘ్రమె నీయగ చేరుకోవయా!!
పట్టుబట్టి జదువ ప్రాపంచమెరుగును
ప్రజల మధ్య దిరుగ ఫలముదక్కు!
మంచిమనసుతోడ మహిని గెలవ వచ్చు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
కం!!!🌺🌺🌺
ముద్దుగ బట్టలు దొడుగుచు
పద్ధతిగా మగువలున్న బహు గౌరవమే!
హద్దులు దాటిన వేళను
దద్దమ్మా యంచు తిట్టు ధరణిని కృష్ణా!!
ఉ!!మా!!🌺🌺🌺
జాతక చక్రవర్తివని శంకర మీకివె జోతలిత్తునే!
మాతగ పార్వతమ్మకిట మానుషులెల్లను పూజసేయగన్!
నూతన జీవితమ్మొసగ నోరిమి తోడను మాకు నెల్లెడన్
శీతలమానసమ్ముగను శీఘ్రమె నీయగ చేరుకోవయా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!