కొనకళ్ల వెంకటరత్నం(బంగారీ మామ పాటల రచయిత)

కొనకళ్ల వెంకటరత్నం బంగారిమామ పాటల రచయితగా సుప్రసిద్ధుడు. ఇతడు పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు గ్రామంలో 1909లో జన్మించాడు. కాకినాడలో ఇతని విద్యాభ్యాసం జరిగింది. పోలీసుశాఖలో పనిచేసి ఏలూరులో స్థిరపడ్డాడు. 1971, జనవరి 9వ తేదీన ఇతడు మరణించాడు. ఇతడు గేయ రచయితగానే కాకుండా కథారచయితగా కూడా ఎన్నదగినవాడు. ప్రతోళి, బంగారిమామ, పొద్దుతిరుగుడుపూలు వంటి గేయకృతులను వ్రాశాడు. ఇతని కథలు ఆంధ్ర పత్రిక,భారతి, పుస్తకం,ఆంధ్రప్రభ,కథావీధి,ప్రగతి,చిత్రగుప్త,ఆనందవాణి,ఆంధ్ర మహిళ, సాహితి, శ్రావణి మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని గేయం మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో 1959లో విడుదలైన సిపాయి కూతురు సినిమాలో మొదటిసారిగా వాడుకొన్నారు. తరువాత ఇదే పాటను అదృష్టవంతులు సినిమాలో మళ్లీ ఉపయోగించుకున్నారు. అలాగే ఇతని రావోయి బంగారిమామా నీతోటి రాహస్య మొకటున్నదోయి అనే గేయం ఘంటసాల గళంలో ప్రైవేటు రికార్డుగా బహుళ ప్రాచుర్యం పొందింది.

కథలు

అడ్డదారి
అతను ఇకరాడు
అది నాబిడ్డ
అద్దంమీద ఆవగింజలు
అనుకోని విరహం.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *