ముసురుకొస్తున్న రక్తవర్ణ చీకట్లు

అక్షర సమూహంఅంశం : నేటి పిల్లల ప్రవర్తన—సామాజిక బాధ్యత

శీర్షిక :ముసురుకొస్తున్న రక్తవర్ణ చీకట్లు

రచయిత : అపరాజిత్ రెడ్డి

సీతను చెరబట్టిన రావణాసురుడు
ద్రౌపది చీర లాగిన దుశ్శాసనుడు
వాళ్ళు ఎంత క్రూరులైనా
కొంతమేర న్యాయబద్ధంగానే ఉన్నారు
నేటి పచ్చకామెర్ల నికృష్ట కామాంధులు
స్త్రీని బట్టలూడదీసి బ్లూఫిల్మ్ లను చిత్రీకరిస్తున్నారు
కుర్రకారు మతిపోగొట్టే దృశ్యాలు చూసి
పిచ్చెక్కి చదువులు గంగపాలు చేసుకుని
మాదకద్రవ్యాలకు బానిసలై ఒళ్ళు రోగాల నెలవై
చదువుకునే కళాశాలకు దూరమై
మనస్సు రాజుకునే అగ్ని కుంపటియై కుతకుతలాడుతూ
భవిష్యత్తు కూలిపడుతున్న శిఖరాలై
ఆ తిమిరాల్లో ఎప్పుడో రాత్రి పూట
కనిపించిన అమ్మాయిని బలాత్కరిస్తే
చేసిన తప్పు తనదే అయినా
తప్పు బూతులు చూపిస్తున్న చీకటి వ్యాపారంలో లేదా,,,,,!?
వ్యవస్థ తనను దోశివి చేసి
పోలీసులు పట్టుకెళ్ళి కాల్చివేస్తే
సమాజం సరియైన గుణపాఠం అని కీర్తిస్తుంది
అబ్బాయి తల్లిదండ్రులు తిండి తిప్పలు లేక రోదనల్లో
బలియైపోయిన అమ్మాయి శీలం
మనస్సు అదుపుదప్పి వెర్రిదవుతూ,,,,,,,,
సమాజాన్ని పీడిస్తున్న విచ్చలవిడి వికృత బ్లూఫిల్మ్ లు
స్త్రీలను వికృతంగా చూపిస్తున్న సినిమాలను రూపుమాపకపోతే
తెలిసీతెలియని వయస్సులో కుర్రకారు
అదే జీవితమై కూలిపోతూ
రెడ్ సెల్యూట్ అంటూ రాలిపోయే అగ్నిపూలు

అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం ఈ రచన నా కలం సేతయని నా హామీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *