యువకులు

అక్షర సమూహం
అంశం :నేటి పిల్లల ప్రవర్తన—సామాజిక బాధ్యత
శీర్షిక :యువకులు
రచయిత. అపరాజిత్ రెడ్డి

ఇలాంటి చురుకైన కత్తిలాంటి యువకులు
భగ్గుమంటున్న భరత ఖండం నిజమైన వారసులు వారధులు
గుండెల్లో చైతన్య జ్వాలలు రేగే జాతి రత్నాలు
పెల్లుబికే యువరక్తం పొంగుల నవతరం నాయకత్వం కావాలిపుడు
దేశం సిరిసంపదలు యువత ఉక్కుకండరాల శ్రమలతోనే సాధ్యం
ఉప్పెనై ఉద్యమించి కండలతో కొండలు పిండిగొట్టే యువతే ఆవశ్యం
పంటచేలల్లో కర్మాగారాల్లో గనులలో రత్నాల్లాంటి నైపుణ్యం గల ఉక్కుపిడుగులు కావాలిపుడు
ప్రజ్వలనాల సంకీర్తనలు పాడే మెరుపుతీగల మెరికల్లాంటి యువరక్తం వాడి వేడి కోరుతోంది దేశం
నిరుపేదల నిర్భాగ్యుల కోసం స్వేదం రక్తం చిందించే నిప్పురవ్వలు కావాలిపుడు
అగ్నికిరీటం పెట్టుకునైనా ఆకలి అలమటింతల అభాగ్యులను ఆవలితీరం చేర్చి శశ్యశ్యామల భారతావనికి పునాదులను చేయాలి
ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులై విరిగి నలిగిన యువతరానికి రాచబాటలు వేసేది
యువకిశోరాల నాయకత్వంలోనే
దేశపురోగతి మూలాలు శ్రమజీవులు రైతన్నలు కాయాకష్టానికి కంటితుడుపు చర్యకాదు కావలసింది పెనుతుఫానులాంటి చట్టాలతో తాము పండించే పంటలతో కుబేరులవ్వాలి
నిస్వార్ధ జాతి రత్నాల్లాంటి యువతరం నిర్వీర్యం కాకుండా దేశరాజకీయాల్లో చరిత్ర సృష్టించాలి
దేశసౌభాగ్యం పూర్తిగా నవతరం యువతరం రేయింబవళ్ల శ్రమల పోరాటంలోనే ఉంది

అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం :ఈ రచన నా కలం సేతయని నా హామీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *