అంకుశపోట్లు

అంకుశపోట్లు

బ్రహ్మ లిఖించిన నుదుటి రాత
మార్చి పునర్లిఖించలేని అశక్తుణ్ణి
గాఢాంధకార జీవితం విషాద రాగాలు పాడుతూ
ఓదార్పు నోచుకోని కన్నీటి సాగరం జీవితం
అలవిగాని కోర్కెలు అందలాలెక్కేందుకు
చేసిన ఊపిరి బాసలు కుప్పకూలి
హృదయం పెనుగాయాల వ్రణాల సలుపులు తిరగదోడుతూ
శ్రమల జీవితం కొనసాగింపులో
మకిలి మనస్కులతో స్నేహాలు కుదరక
కన్నీటి ఎద మాటున రహస్యాలేవి దాచుకోలేని ఆశక్తుణ్ణి
నింగి నిండు చూలాలై కురిసే కుంభవృష్టి
జీవితాన్ని మింగేసే వరద విపత్తుల పోట్లు
కన్నీళ్ల యజ్ఞం మిగిల్చిన మనిషిని
కోరికలన్నీ సద్దుమణిగి జిహ్వ ఆలోచనల పరంపరలో
అక్షరాలు సోదెమ్మ చెప్పిన కట్టుకథలై
పాఠకులు తోటి కవులే చదివేవాళ్ళు లేక వెలవెలబోతూ
పక్కవాడు పరిచయస్తుడు కాడు కదలడు మెదలడు పందిరిగుంజ,,,,,
జీవితం కదలిపోతూ జన్మసార్ధకంలేని అంకుశపోట్లు
వృధా వ్యాపకాలతో జమదగ్నిని.

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *