అంతర్జాతీయ అంధుల ఆసరా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న జరుపుకుంటారు. అంధుల జీవితంలో తెల్లటి చేతికర్ర ప్రాముఖ్యతను, అంధత్వ అవగాహనను పెంచడానికి ఈ రోజును ఐక్యరాజ్యసమితి 1981లో స్థాపించింది.
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు . కంటిచూపుతో ప్రపంచాన్ని చుట్టేయవచ్చు . కనుసన్నల్తో ఆ ప్రపంచం లో బతికేయవచ్చు . అదే చూపు లోపిస్తే అంతా అంధకారమే . జీవితం చీకటిమయం అయిపోతుంది . రంగుల ప్రపంచము సుదూరతీరాలకు వెళ్ళిపోతుంది . ఆ కటిక చీకటిలో ఆ తీరము ఎప్పటికీ అందకుండానే మిగిలిపోతుంది. అందుకే ఆ చూపును ఎప్పుడూ పదిలం గా కాపాడుకోవాలి .
అంధత్వము అంటే పూర్తిగా గాని పాక్షికం గా గాని చూడలేని స్థితి. కంటి చూపు పోవడాన్ని గుడ్డితనం లేదా అంధత్వం అంటారు. ఇది నేత్ర సంబంధమైన లేదా నరాల సంబంధమైన కారణాల వలన కలుగవచ్చును.
దృష్టి మాంద్యాన్ని కొలిచే వివిధ కొలమానాలు మరియు అంధత్వ నిర్వచనాలు అభివృద్ధి చేయబడ్డాయి.” పూర్తి అంధత్వం అనగా దృష్టి పుర్తిగా లోపించడం. దీనిని వైద్య పరిభాషలో “NLP” (No Light Perceptionan) అంటారు. వీరు కాంతి ఉన్నదీ లేనిదీ మరియు ఆ కాంతి ఏ దిక్కు నుండి వస్తున్నదీ మాత్రమే గుర్తించగలరు. సాధారణమైన అంధత్వం అనగా దృష్టి లోపం తీవ్రంగా ఉన్నప్పుడు మరియు ఇంకా కొంత చూపు మిగిలి వున్నప్పుడు ఉపయోగిస్తారు.
అంధులలో ఎవరికి ప్రత్యేకమైన సహాయం అవసరం అనే విషయం మీద వివిధ ప్రభుత్వ చట్టాలు క్లిష్టమైన నిర్వచనాలు తయారుచేశాయి. వీటిని చట్టపరమైన అంధత్వం అంటారు. ఉత్తర అమెరికా మరియు ఐరోపా దేశాలలో ఈ అంధత్వాన్ని సవరించిన దృష్టి తీవ్రత (20/200 (6/60) లేదా అంతకంటే తక్కువగా ఉంటే చట్టపరంగా అంధునిగా భావిస్తారు. ఇంచుమించుగా 10 శాతం చట్టపరంగా అంధులుగా నిర్ణయించినవారికి ఏ మాత్రం దృష్టి ఉండదు. మిగిలిన వారికి కొంత చూపు మిగిలివుంటుంది. కొనిసార్లు 20/70 to 20/200 చూపును కూడా దృష్టి లోపం అంటారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం దృష్టి మాంద్యం అనగా సవరించిన దృష్టి తీవ్రత 6/18 కంటే తక్కువగా ఉండడం, కానీ 3/60 కంటే మెరుగ్గా ఉండడం. అంధత్వం అనగా దృష్టి తీవ్రత 3/60 కంటే తక్కువగా ఉండడం.
కొన్ని రంగుల మధ్య భేధాన్ని గుర్తించలేకపోవడాన్ని వర్ణ అంధత్వం లేదా వర్ణాంధత అంటారు. రాత్రి సమయంలో విటమిన్ ఎ. లోపం మూలంగా కలిగే దృష్టి మాంద్యాన్ని రేచీకటి అంటారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అంచనాల ప్రకారం 2002 సంవత్సరంలొ ప్రపంచంలో సుమారు 161 మిలియన్ (సుమారు 2.6% జనాభా) మంది దృష్టి లోపాలతో బాధపడుతున్నారని వీరిలో 124 మిలియన్ (సుమారు 2%) మందిలో దృష్టి మాంద్యం ఉన్నట్లు మరియు 37 మిలియన్ (సుమారు 0.6%) మంది అంధులుగా ప్రకటించింది.
మాధవి కాళ్ల
సేకరణ