అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలతో….ఆటవెలదులు*గురువు మాటపైన గురినిల్పు శిష్యుడుఅన్ని శాస్త్రములను అభ్యసించుగురువు మాటలు వినగోరని శిష్యుడుపనికి రాక మిగుల పతనమగును!

గురువు మాటమీద గురినిల్ప కున్ననూ
తల్లిదండ్రి మాట దాటుతున్న
పెద్ధవారి మాట పెడచెవి బెట్టినా
నిరుపయోగమగును నిండు భవిత!

వినయమున్నవాడు విద్యలార్జించును
లక్ష్య పెట్టకున్న లక్ష్మి రాదు
విద్య , లక్ష్మి వున్న విశ్వమంతా కీర్తి
వచ్చితీరు,జనము మెచ్చి తీరు !

                       .......... కోట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *