అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా..!!

ఇంటికి దీపంలా వెలుగుల్ని పంచే
అమ్మలా లాలించి ఆదరించి నిలిచే
కమ్మని పిలుపుతో ఆప్యాయతను నింపి
ప్రేమకు మరో రూపమని ఇంటిలో వెలిసింది..

కమ్మని పలకరింపులో మాధుర్యం
అనుబంధాలను అలరించే సుగంధం
ఇంట్లో గజ్జల సవ్వడి లతో మురిపించి
గాజుల గలగల తో నిండుదనం తెచ్చింది…

చిట్టి పోటీ మాటలతో ఆకర్షించే
ముద్దు ముద్దు మాటలు వినిపించి
తరగని ఫలం మై సంతోషం కలిగించింది
కాంతివంతమైన ఇంటిని వికసింప చేసింది..

లక్ష్మీదేవిలా నట్టింట్లో నవ్వుల నడక
సిరులు కురిపించే సంతోషాల పువ్వుల్లాగా
అమ్మానాన్నలకు ఆనందం పంచుతూ
ఇంటిని స్వర్గంలా ఆనందంగా ఉంచగలిగింది.

చదువుల తల్లై రాణించే ఉన్నత విద్యలు
శాస్త్రాలెన్నో అభ్యసించిన ‌ శాస్త్రవేత్తలు
గౌరవనీయమైన పదవుల్లో సగర్వంగా నిలిచి
ఆకాశములో సగమై విహరిస్తుంది..

అన్ని రంగాలను ముందుండి నడిపించి
ప్రపంచంలో తనకంటూ ఓ స్థానం కల్పించుకునే
అడుగడుగునా అభివృద్ధి కాంక్షిస్తూ
విశ్వరూపం ప్రదర్శించి విశ్వ విజేతగా నిలిచింది..!!
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *