అందమైన కవితలు

కలం చేతపడితే నేను నేనుకాని లోకంలో తలబాదుకుంటూ విలువల కవిత్వం లిఖిస్తే వలువలు లేని కవిత్వం లిఖించావంటారు న్యాయమా ?నిజం నిగ్గుతేలిస్తే సిగ్గు సిగ్గు అంటూ వాపోయారు. నా పూవుల అక్షరాలు ముళ్లయి గుచ్చుకుంటే నేనేం చేయను ? అందమైన కవితలు సరస్సున పూసిన కమలాల సుప్రభాతాల రమ్యమైన రాగానురాగాల ప్రేమ సామ్రాజ్యాల సరససల్లాపాలలో తేలిపోవడమేనా జీవితమంటే !?!
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *