ప్రేమ !
మనస్సు లోగిలిలో
రెండు హృదయాల కలబోతే ప్రేమ !
అనురాగం, ఆప్యాయత, అనుబంధం
జాలి, కరుణ, దయ
సమపాళ్లలో మేళవింపే ప్రేమ !
యవ్వనంలో వున్న మగ, ఆడల మధ్య
భావాలు, అభిప్రాయాలు, ఆలోచనలు, ప్రవర్తనల తీరు
ఒకరికి ఒకరు సమభాగాలైతే
ఏర్పడేదే నిజమైన ప్రేమ !
నిరంతరం మారుతున్న సమాజం లో ఇది కొరవడి
శారీరక సౌందర్యమే ప్రేమ గా భ్రమసి
పరస్పర ఆకర్షణ లో పడి
సినిమాలకు, షికార్లకు పరుగులెత్తి
చదువులు గంగ పాల్జేసి !!
కలవని మనసులతో
వీళ్ళు పోగొట్టుకున్న దేదో తెలీక
మత్తు వదలక భగ్న ప్రేమికులై
మత్తు మందులకు అలవాటుపడి
ఉన్మాదం లో ఘాతుకాలకు పాల్పడుతున్నారు !!
వెర్రి వాళ్ళై దిక్కులు పిక్కటిల్లేలా రోదించినా
పోగొట్టుకున్న భవిష్యత్ తిరిగి రాదు
సినిమా ప్రేమ లు నిజం కాదని తెలిసి వచ్చి !
అర్ధాంతరంగా బ్రతుకులు చాలిస్తున్నారు !!
ఇక ఒన్ సైడ్ లవ్
ఇదొక తిక్క !!
వెర్రి వాళ్ళ లా ఓ అందమైన అమ్మాయిని
ప్రేమించమని వేధిస్తూ ””””””
ఆమె తిరస్కరిస్తే
అందని ద్రాక్ష లా !
పొందని ప్రేమ కోసం
మనస్సు శకలమై విళ విళ లాడుతూ !!
వేదన శృతి మించితే
పబ్లిగ్గా కత్తి తో ఆమె పై దాడి చేయడమో
తనకు తాను పొడుచుకోవడమో చేస్తే !!
పిల్లల తల్లి దండ్రుల కడుపు కోత తీరేదెలా? !!
ప్రేమనాలా? ఉన్మాదమనాలా?
చదువు బూడిదలో పోసిన పన్నీరై !
యవ్వనం లోనే వృద్ధుల్లా
యువత నిర్వీర్యమై పోతుంటే !
కలాలు కదపరేం? !!
అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం : ఈ రచన నా కలం సేతయని నా హామీ.