నా హృదయం నా హృదయం గిరిజనుల వైపు చూసింది ప్రళయం
కదం తొక్కుతూ రణం సాగిస్తూ
నడుస్తాను మున్ముందు
కర్మ వీరులకు స్వాగతం పలుకుతాను
విప్లవ కారులకు అనునిత్యం వెంటే ఉంటాను
బాల్య వివాహాలు రద్దు చేద్దాం
చట్టాలు తీసుకొచ్చినారు కానీ ఏమి లాభం
తెలియని మూడత్వం చాందస తత్వం వారిలో చొచ్చుకుపోయాయి
సామాన్యుని బ్రతుకు సంఘర్షణ సంకీర్తన నడుచు
బాల్య వివాహాలు పై చైతన్యం చేద్దాం
విశ్వ జగత నందు యుద్ధంబు చేద్దాం
అమరమై అకిరమై ఒంటెద్దు బంధిలా కాక
నాలో కలిగే విప్లవం అది నీకోసమే
నాలో రగిలే ఆత్మఘోష అది నీకోసమే
కొండలోన కోనలోన గిరిజన బడబాగ్ని లోన
మ్రోగించు దాము చైతన్య రణ దీపిక
ఆశలు పుట్టించుదాము ఆరోగ్య బోధ వైపు
ఆశలు రగిలించుదాము చట్టాలను గౌరవించుట కొరకు
ఇదేనా మేలుకొలుపు ఇదేనా జన జాగృతి ఆవేదనము.
హామీ పత్రం
ఈ కవిత నా యొక్క సొంత రచన