సిగ్గు లేదా జనుడ నీచ బ్రతుకు
మందు త్రాగి బ్రతుకుట అది భవితా నీకు
నీ దేహమే గలుగు దేవాలయం
శుభ్రపరచుకొనుము పరిశుద్ధ గల్గు
పట్టెడన్నము నోచని సమయంబు కూడా
సతి నీ మెడ యున్న సూత్రంబు అమ్మి
నీచమైన బ్రతుకు మనుగుడేల జన్మ
మూత్రపిండం జబ్బు తెచ్చు ఆరోగ్యం ముంచి పెట్టు
అనారోగ్యం దరిచేరు అట్టి బ్రతుకు మనకు ఎలా?
ఓ జనుడా వినుడు ముందు కోట్లు కాదు ఆరోగ్యము ఐశ్వర్యము మన తెలుగు జాతి నిండు గౌరవం.
హామీ పత్రం
ఈ కవిత నా యొక్క సొంత రచన