సమీక్ష
అంశం : నచ్చిన సినిమా పాత్రతో ప్రేరణ పొందిన తీరు,,,,,
శీర్షిక : అక్కినేని జీవించిన పాత్ర,,,,,,!!
రచయిత పేరు: అపరాజిత్ రెడ్డి
నాకు నచ్చిన సినిమా మేఘసందేశం ఇందులో అక్కినేని పాత్ర మహోన్నతంగా తీర్చిదిద్దాడు దర్శకుడు దాసరి.
అక్కినేని కళారాధకుడుగా ముఖంలోనే అద్భుత హావభావాలతో నటన అనడం కంటే జీవించాడు అనడం సబబు.
కళ వేరు కళారాధన వేరు ఆ పాత్రలో అతని కళాతృష్ణ చాలా గొప్పగా చిత్రీకరించారు.
నాట్య మయూరి జయప్రద అద్భుత నాట్యం ,సున్నిత భావాలను ఒలికించిన తీరు మహాఅద్బుతం.
అక్కినేని ఆమె సౌందర్యం కంటే ఆమె నాట్యాన్ని ఆరాధించిన తీరు అదీ ఎటువంటి జుగుప్స లేకుండా తాను వయస్సు మల్లిన గొప్పకవిగా నటనా కౌశలం అనితర సాధ్యం. కేవలం జయప్రద మాహాద్భుత నాట్యం కోసమే ఉవ్విళ్ళూరే కళాతృష్ణ అక్కినేని, కేవలం ముఖ బంగిమలలోనే ప్రదర్శన కళారాధన కూడా గొప్పకళగా దాసరి చిత్రీకరణ మహోన్నతం. కళారాధకులు లేనిదే కళకు విలువేముంది ? మనకు మనం ప్రశ్నించుకోక తప్పదు.
జయప్రద, అక్కినేని దర్శకుడు రూపం కల్పించిన పాత్రలా లేక ఒకరి కళలో ఒకరు జీవితం పంచుకున్న కళాతపస్సు గల ప్రాణాలా వీళ్ళవి ?సాగిపోయే రైలు పట్టాల్లా బహుదూరపు ప్రయాణికులా వీళ్ళు ? అక్కినేని ఒక మహాకవిగా ఎక్కడా అగుపించకుండా కేవలం నటనతోనే మహోన్నత కవిగా రూపుదిద్దిన దర్శకుని చిత్రీకరణ అవధులు దాటింది.
అక్కినేని భార్య పడే వేదన సంవేదనలు గొప్ప కళాతృష్ణ గల ఆస్వాధకురాలిగా జయసుధను చూపించడం మహామహుల అద్భుతమైన చిత్రంగా చిరకాలం గుర్తుండిపోయే సినిమా కళారాధకులకు.
అక్కినేని మాహాద్భుత చిత్రంగా డైలాగుల కన్నా హావభావాలతోనే జీవించి ప్రదర్శించిన తీరు ముగ్దమనోహరమైన దాసరి చిత్ర కావ్యం మేఘసందేశం.
అపరాజిత్
సూర్యాపేట