అక్టోబర్ 15 ప్రత్యేకతలు :⁠-

  1. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం.
  2. 1542 : మొఘల్ చక్రవర్తి అక్బర్‌ సింధు ప్రాంతంలోని అమర్‌కోట్‌లో జన్మించాడు (మ.1605).
  3. 1908 : ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్ జననం (మ.2006).
  4. 1918 : భారతీయ అధ్యాత్మిక గురువు, హిందూ, ముస్లిం ల ఆరాధ్య దైవం షిర్డీ సాయిబాబా పరమపదించాడు (జననం తెలియదు).
  5. 1918 : సారస్వత నికేతనం తెలుగు గ్రంథాలయం ప్రకాశం జిల్లా వేటపాలెం లో ప్రారంభం.
  6. 1920 : ప్రముఖ సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత భూపతిరాజు విస్సంరాజు జననం (మ. జూన్ 8, 2002).
  7. 1929 : ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం జననం.(మ.2012).
  8. 1931 : భారత దేశపు మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ జననం.(మ.2015).
  9. 1937 : స్వాతంత్ర్య సమరయోధుడు, కొచ్చిన్ సంస్థానం యొక్క మాజీ దీవాన్ నెమిలి పట్టాభి రామారావు మరణం (జ.1862).
  10. 1964 : చైనాలో అత్యంత ధనిక వ్యాపారవేత్త మరియు ఆలీబాబా వ్యాపార సంస్థల అధినేత జాక్ మా జననం.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *